శ్రీ సీతారామాంజనేయసంవాదము
129
తా. ఈరాజయోగమే మోక్షమునకు రాజమార్గము. అది రహస్యము, సర్వోత్తమము, విద్యలలో నెల్ల శ్రేష్ఠతమమైనది. సాంఖ్యము, తారకము, అమనస్కము అను భేదములు కలిగి యారాజయోగము మూఁడువిధములై యెప్పుచున్నది.
అవ. ఈ పైఁజెప్పిన మూడింటిని అభ్యసించుటవలనఁ గలుఁగు ప్రయోజనముల వివరించుచు, సహేతుకముగా తారకయోగమును వివరింప నుపక్రమించుచున్నాఁడు ——
| తే. | తారకంబు మనశ్శుద్ధికారకంబు | 90 |
టీ. తారకంబు = తారకయోగమనునది, మన...కంబు - మనః = మనస్సుయొక్క, శుద్ధి = శుధ్ధిని, కారకంబు = చేయునది, సాంఖ్యము = సాంఖ్యయోగము, ఆత్మస్వరూపవిచారకంబు - ఆత్మస్వరూప = జీవస్వరూపమును (లేక బ్రహ్మస్వరూపమును), విచారకంబు = విచారించునట్టిది, అమనస్కము = అమనస్కయోగము, అనుభవజ్ఞానము = అపరోక్షానుభవజ్ఞానమును కలిగించునది, అట్లుగావునన్ = అట్లగుటచేత, మొదలన్ = మొట్టమొదట, ఆద్యము = మొట్టమొదటిదైన తారకయోగమును, ఎఱిఁగింతున్ = తెల్పెదను, నీవు, అవధరింపుము = వినుము.
తా. పైన వర్ణింపఁబడిన మూఁడింటిలోఁ దారకయోగమువలనఁ జిత్తశుద్ధి కలుగును. సాంఖ్యయోగమువలన నాత్మతత్త్వము తేటపడును. అమనస్కయోగమువలన నపరోక్షానుభవము కలుగును. అన్నిటికంటే మొదటఁ జిత్తశుద్ధి కావలయును గావున దానికి సాధన మగుతారకయోగమును మొట్టమొదట వివరించుచున్నాను.
అవ. తారకయోగమునం దభిరుచిఁ గలిగించుటకై యర్థవాదము నుపక్రమించుచున్నాఁడు.
| ఉ. | తారక ముద్భవాంబునిధి తారక మంబుజ సంభవాదిబృం | 91 |
టీ. మారుతీ = ఆంజనేయా, తారకము = తారకయోగము, ఉద్భ... మును - ఉద్భవము = జన్మమనియెడు, (లేక, సంసార మనియెడు,) అంబునిధి = సముద్రమును, తారము = తరింపఁజేయునది, అంబు...బును - అంబుజసంభవాది = బ్రహ్మ మొదలగు, బృందారక = దేవతలచేత, సన్నుతంబు = స్తోత్రము చేయఁబడునది. అఘ...మును - అఘ = పాప