పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

శ్రీ సీతారామాంజనేయసంవాదము


యోగమును, సంశ్రయింపలేక = ఆశ్రయింపక, విమూఢులగుచున్ = అజ్ఞానులై, సంసా రవనధిలోన్ = సంసారసముద్రమున మునుఁగుచుండుగురు.

తా. ఇట్లు పరమరహస్య మగునీరాజయోగమును సద్గురువులయను గ్రహము వలన నెఱిఁగి శ్రద్ధావంతులై యభ్యాసముచేసికడతేర నిచ్ఛయింపక సంసారసముద్ర మున మునుఁగుచుఁ దేలుచు బాధ నొందుచున్నారు. ఈయోగ మెంతసులభ మైనను వారు దాని నాశ్రయింప లేకున్నారు. వారియఙ్ఞానమున కేమందుము ?.

క. ఈరాజయోగమార్గం, బీరేడు జగంబులందు నెవ్వ రెఱుఁగ రా
   త్మారామలసదపాంగా, పారకృపాయుక్తులైనభక్తులు దక్కన్. 88

టీ. ఈరాజయోగమార్గంబు = ఈ జ్ఞానయోగపద్ధతిని, ఈరేడు జగంబులందున్ = పదునాలుగు లోకంబులందును, ఆత్మా... క్తులు - ఆత్మారామ = సర్వాంతర్యామి యగు శ్రీరామునియొక్క, లసత్ = -ప్రకాశించుచున్న, అపాంగ = కడగంటి చూపు లయొక్క , (ఆపాంగశబ్దమునకు నేత్రాంతమనియే యర్ధమైనను లక్షణావృత్తిచే కడ గంటిచూపనియర్థము చెప్పఁబడెను.) కృపాయుక్తులు = దయతో గూడిన, ఐనభక్తులు, తక్కన్ = తప్ప, ఎవ్వరెఱుఁగరు = ఎవ్వరును తెలిసికొనలేకు,

తా. ఈరాజయోగ మెంతరహస్యమైన చైనను అంతర్యామిస్వరూపుఁ డగు సీరామునియందు భక్తి కలిగి యీతనిదయారసమునకుఁ బాత్రులై యుండు వారలకుఁ గరతలామలకంబుగఁ దెలియును. ఇతరు లెవ్వరు నట్లు ఎఱుఁగలేరు. కావున ఈయో గము సిద్ధించుటకు భక్తి ప్రధానము.

ఆవ. ఇట్లు రాజయోగమును సామాన్యముగాఁ బ్రశంసించి విశేషముగ వివ రించుటకై మొట్టమొదట దానిని విభాగించు చున్నాఁడు -

తే. రాజయోగంబు ముక్తికి రాజపథము
    రాజగుహ్యంబు పరమంబు రాజవిద్య
    యదియు మూఁడువిధంబుల నలరుచుండు
    సాంఖ్య తారక సుమనస్కము లనంగ. 89

టీక. రాజయోగంబు = ఈజ్ఞానయోగము, ముక్తికిన్ = మోక్షమునకు, రాజప ధము = రాజమార్గమువంటిది, రాజగుహ్యంబు = మిగులరహస్యమైనది, పరమంబు = శ్రేష్ఠ మైనది, రాజవిద్య సకలవిద్యలలో నుత్తమమైనది, అదియున్ = ఆరాజయోముకూడ, సాంఖ్య. . . ములు - సాంఖ్య = సాంఖ్యయోగము, తారక = తారకయోగము, సత్ = శ్రేష్ఠ మైన, అమనస్కములు = అమనస్క యోగము, అనఁగన్ = అన , మూఁడువిధంబులన్ = మూఁడుభేదములుగలదియై, అలరుచుండున్ = ఒప్పుచుండును.