పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

127

టీ. ప్రత్యక్షాపగమంబు- ప్రత్యక్ష ప్రత్యక్షముగాఁ గానవచ్చు ప్రపంచమును, (అనఁగాః ప్రపంచ భ్రాంతిని,) ఆపగమంబు = నశింపఁజేయునదియు, పావనమును - పరిశుద్ధమైనదియునగు, అభ్యాసంబుఁ గావింపఁగాన్ = ఆభ్యాసము నాచరించినట్లైన, అత్యం . . . ఖంబు_అత్యంత=నశిఁపని, ఉరు = అధిక మైన, సుఖంబు = చిత్తశాంతిని గలిగించునదియు,ధర్మము=పుణ్యరూపమైనదియు, అతిగుహ్యంబు మిగులరహస్యమైనదియు, ఉత్తమంబు = శ్రేష్ఠమైనదియు, అద్యమును = అనాదిసిద్ధమైనదియు, సత్యంబు =శాశ్వతమైనదియు, ఆగమసిద్ధము-ఆగమ = కామికము మొదలగు నిరువదియెనిమిది యాగమంబులందును, సిద్ధము= సిద్ధ మైనదియు, ఆదిమునిరాట్ససంస్తుత్యమును, ఆదిముని = పురాతనులగు సనకాదిమహామునులకు, రాట్-ఫ్రభువులైన (లేక, గురువుకైన) దక్షిణామూర్తి మొదలగువారలచే, సంస్తుత్యమును - స్తోత్రము చేయఁదగినదియు, వేద్యమును = మోక్షేఛ్ఛగలహరిచే నవశ్యము తెలియఁబడతగినదియు, నిత్యానందము నిత్య = ఎడతెగని, ఆనందము = బ్రహ్మరూపమగు పరమానందము నొసంగునదియు, ఐన రాజయోగము = యోగములలో నుత్తమమగు జ్ఞానయోగము అయిన, మహానిర్వాణమార్గంబు = ప్రసిద్ధమగు మోక్షమార్గమై, అగున్ = సిద్ధించును (ఈరాజుయోగమే మోక్షమునకు చక్కని త్రోవ )

తా. ఈజ్ఞానయోగమునకే రాజయోగ మని పేరు. ఇది మిగులఁ బరిశుద్ధమైనది. మోక్షేచ్ఛ గలవారిచే నవశ్యముఁ దెలియఁ దగినది. అనాదిసిద్ధమై దక్షిణామూర్తి, హయగ్రీవుఁడు మొదలగు జగద్గురువుల చే స్తోత్ర పూర్వకముగా నాదరింపబడుచుండినది, వేదములలోను ఆగమములలోను ప్రసిద్ధ మై "ఇదియే సర్వయోగములలో శ్రేష్ఠతమమైనది సత్వమైనది ఆనందస్వరూపమైనది” అని కొనియాడఁ బడుచుండునది. రహస్యములలో నెల్ల రహస్యతమమైనది. దీని నభ్యాసము చేయఁగా ఆవిద్యా ప్రభావమువలనఁ దనకంటె వేఱుఁగా గానవచ్చు నీ ప్రపంచము నశించును. (తనకంటే నన్యము గాఁ గానరాదు). నిరతిశయ మగు బ్రహ్మానందము (తానే బ్రహ్మమని తెలిసికొనుట వలనఁ గలుగు నానందము.) కలుగును. ఈరాజయోగమే మోక్షమునకు మార్గమని తెలిసికొనుము.

ఆ. రాజగుహ్య మైన రాజయోగంబును
   శ్రద్ధధాను లగుచు జనము లెల్ల
   సంశ్రయింప లేక సంసారవనధిలో
   మునుఁగుచుండుదురు విమూఢు లగుచు.87

టీక . జనము లెల్లకొ=మనుష్యులందఱును, శ్రద్దధానులగుచు = శ్రద్ధగలవారలై, రాజగుహ్యమైన = రహస్యములలో నెల్ల రహస్యమగు, రాజయోగంబున్ = ఈజ్ఞాన