పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

125


సీ. కమలాసనస్థుఁడై కాయంబు నిక్కించి
         కరము లూరులఁ జేర్చి కనులు మూసి
   దేహేంద్రియ ప్రాణధీమ నాదిక మెల్ల
         దృశ్య మే గాను దద్దృక్కు నేను
   దృశ్యమేఁ గాను దద్దృక్కు నేననువృత్తి
         దృశ్యంబ కానఁ దదృక్కు నేన
   యని విజాతి ప్రత్యయనివృత్తిగా సజా
         తిప్రత్యయ ప్రవృత్తిక్రమమున

తే. నాత్మ దానై నయందాఁక నయ్య జేష
    దృశ్యదృగ్వృత్తులను నిషేధించుకోనుచు
    ననిశ మాత్మావలోకన మందుచుంట
    నిర్గుణధ్యాన మనఁ జెల్లు నిర్మలాత్మ.

తా. ధ్యానము సగణధ్యానము నిర్గుణధ్యానము అని రెండు విధములు. అందు హృదయపద్మమందు తటస్థలక్షణస్వరూపుఁడయిన విరాట్పురుషుని నిలిపి మనస్సు చేత సమస్తవస్తువులను గల్పించి షోడశోపచారములను చేసి ధ్యానించుటయే సగుణ ధ్యానము. పద్మాసనంబుననుండి శరీరంబు నిక్కించి హస్తంబులను తొడల పై నుంచి నేత్రములు మూసి స్థూలసూక్ష్మ కారణశరీరములును పదునాలు గింద్రియంబులును దశ విధప్రాణంబులనుదృశ్యములు అదేహేంద్రియప్రాణంబులు నేఁ గాను. వీనిని వీక్షించు సాక్షిని, సాక్షినినేననెడు వృత్తియును దృశ్యమే గనుక ఆవృత్తిని జూచుసాక్షిని అని మాయాకల్పితములై విజాతీయములగు యుష్మత్ప్రతీతిప్రత్యయగోచరాదులనెడు బహిర్దృ శ్యములను, సజాతీయములగు అస్మత్ప్రతీతి ప్రత్యేయగోచరాదులనెడి యంతర్దృశ్య ములను, ఆదృశ్యములకు సాక్షిననెడు వృత్తిని నిషేధించుచు సత్యజ్ఞానానందనిర్మలా ఖండస్వరూపమై సర్వదృక్కగు పరబ్రహ్మము తాననెడు ధార్ఢ్యముగలుగుదాఁక ఎల్లప్పుడు నిర్వికల్పబ్రహ్మనిష్ఠ గలిగియుండుటే నిర్గుణ ధ్యానము.

ధారణాలక్షణము.

మూలాధారము స్వాధిష్ఠానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆజ్ఞేయము సహస్రారము అనెడు కమలములయందు వానికి నధిదేవతలైన గణపతి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ గురుచరణములను అక్కడక్కడ ధ్యానించునపుడు మనస్సును నిలుపుటే ధారణాయోగము. ప్రత్యగాత్మ నైన నేనే పరమాత్మను. ఆపరమాత్మయే ప్రత్యగాత్మ అని నిష్ఠ చేయుచుండుటే సమాధి అని ఈవిధముగ అభ్యాసయోగము ఎనిమిదంగములు కలిగియుండును. అది చిత్తపరిపాకము లేనివారికి తగినది. మిక్కిలి కష్టతరమైనది. ఈఅభ్యాసయోగమును వాడుక చేసినవారికి ఆణిమాద్యష్ట