పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

శ్రీ సీతారామాంజనేయసంవాదము


టీక. వత్సా=బిడ్డా . మా .....డై - మాయా = మాయయొక్క గుణ = సత్త్వరజస్తమో గుణములను,అనుగతుడై = అనుసరించువాఁడై, పాయక = విడువక , నానా... చంబు- నానావిధ = అనేకవిధములైన, ప్రపంచంబు = లోకములను, ఇతఁడే = ఈరాముఁడే, చేయునని = చేయుచున్నాఁడని (అనఁగా : సృష్టించుచున్నాఁడని) తోచున్ , ఏమి యుఁజేయఁడు = యథార్థ స్థితిలో ఈ రాముఁ డే కార్యమును జేయువాఁడుకాఁడు, అసంగుండు = వాస్తవములో నాయనకు దేనితోను సంబంధము లేదు. అకర్త = ఇట్లగుటచే నేమియుఁ జేయఁడు, సిద్ధము = ఈ విషయము సిద్ధాంత మైనది.

తా. ఓహనునుంతుఁడా, సత్త్వరజస్తమోగుణముల వికారమువలన (అనఁగా సత్వరజస్తమోగుణము లే మాయ కావున నది చేయుచుండుకార్యములవలన) సర్వవ్యా పకుఁడగు ఏరాముఁడు కర్తయైనట్లు తోఁచుచుండును. ఆగుణములయంను వ్యాపించి " యున్న పరమాత్మునిసహాయముచే నాగుణములే యిట్లు సృష్ట్యాదులను చేయుచున్న పని తెలిసికొననేరక జను లిట్లు భ్రాంతి గాంచుచున్నారు. పరబ్రహ్మమాత్ర మేమియును చేయువాడు కాఁ డనుట సిద్ధాంతము.

అవ. ఇ ట్లాపరమేశ్వరుఁడు సంక్షిప్తముగ సీతాకృతోపజేశరూపమున రామతత్త్వము నెఱింగించి పా ర్వతీదేవికిఁ గలిగినసంశయము నివారించి యాతత్త్వముననే విస్తరించి చెప్పు నుద్దేశముతో నాంజనేయకృత ప్రశ్న మీ క్రింద నభివర్ణించు చున్నాడు___

వ. అనిన విని హనుమంతుండు సీతాదేవి కిట్లనియె.81

టీక. అనినవిని = అని చెప్పఁగావిని, హనుమంతుండు, సీతాదేవికిట్లనియెన్ = సీతాదేవిని జూచి యీ క్రింది విధముగా ప్రశ్నఁజేసెను .

శా. ఓ పార్వతీ. ఈవిధముగ సీతాదేవి శ్రీ రామతత్త్వము నుపదేశించిన విని హనుమంతుఁ డామెతో నిట్లనియెను.

తే. రామచంద్రుడు తారకబ్రహ్మ మగుట
    సత్యమగుఁ గాని యిమ్మహాసర్యమయుని
    సులభముగఁ గాంచు పరమసూత్ర మెద్ది
    నా కెఱింగింపవమ్మ లోకైక జనని! 82

టీక. లోకైకజనని- లోకైక = సకలలోకములకును ముఖ్యమైన, జనని= తల్లీ (సీతాదేవీ), రామచంద్రుఁడు, తారక బ్రహ్మమగుట = సంసారమును తరింపఁజేయఁ గల పరబ్రహ్మస్వరూపుడై యుండుట, సత్యమగుఁగాని = యథార్థమే యగును గాని, ఇమ్మహాసర్వమయుని = సకల ప్రపంచరూపుఁడగు నీసర్వవ్యాపకుని, సులభమున్