పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

శ్రీ సీతారామాంజనేయసంవాదము


తా. ఒక మనుష్యుని, మన మెఱుంగకున్నను బేరు పెట్టి పిలిచినచో వాడు మనదగ్గరకు వచ్చునట్లు, ఆరాముని మన మెఱుఁగకున్నను, (అనగా నారామునిరూపము, లేక యారాముని తత్త్వము మనకింతకుముందు ప్రత్యక్షము కాకున్నను) అమ్మహాత్ముని నామమును జపించినయెడల నాదయామయుఁడు తత్క్షణమే ప్రత్యక్షమగును.

సుగంధివృత్తము.
    రామ రామ రామ రామ రామ రామ యంచు శ్రీ
    రామ రామ రామ రామ రామ రామ యంచు శ్రీ
    రామ రామ రామ రామ రామ రామ యంచుఁ ద
    న్నామకీర్తనంబుఁ జేసినం గలుంగు మోక్షమున్. 67

టీక. తన్నామకీర్తనంబున్ = ఆరామనామము యొక్క స్మరణను, (తక్కిన యర్థము సులభము.)

తా. "త్రిషట్కానిచ నామాని పఠే ద్రామస్య యో నరః, సత్రయోపాధిరహితః మోక్షం సమధిగచ్ఛతి " ఏమనుష్యుఁడు రామనామమును పదునెనిమిది మాఱులు (అనఁగా : ఒక్కొక్క పర్యాయమునకు ఆఱు నామములుగా మూఁడుమాఱులు) జపించునో వాఁడు క్రమముగా స్థూలసూక్ష్మకారణశరీరము లనుమూఁడు ఉపాధుల నతిక్రమించి మోక్షమును జెందును” అనువాక్యము ననుసరించి, రామనామజపమువలన మోక్ష మవశ్యముగ సిద్ధించును.

క. నిరతంబు రామనామ, స్మరణంబునకంటె మోక్షసాధన మితరం
   బరయంగ లేదు ధరలోఁ, బరమసులభ మైనలసదుపాయం బబలా.68

టీక. ఆబల= ఓ పార్వతీ!, నిరతంబున్ = ఎల్లప్పుడును, రామనామస్మరణంబునకంటెన్ = రామనామజపము సేయుటకంటె, ఇతరంబు = వేఱైన, మోక్షసాధనము = మోక్షమునుసాధింపఁగలిగినట్టియు, పరమసులభము = మిగులసులభమైనదియు, ఐనలసదుపాయము = ఐనట్టిశ్రేష్ఠమైనయుపాయము, ధరలో = ఈభూమిలో, అరయంగన్ = విచారింపఁగా, లేదు.

తా. పార్వతీ! మనస్సునకును, శరీరమునకును శ్రమ కలిగించుమోక్ష సాధనము లనేకములున్నను ఈరామనామజప మంత సులభమైనవి, ఇంత దృఢముగా మోక్షఫలమునిచ్చునవి ఎవ్వియును లేవు. కావున నీరామనామము, సకలమనుష్యులచేతను ఉపాసింపఁదగినది.

వ. అని యిట్లు శ్రీరామమంత్రంబును దత్ప్రభావంబు నుపదేశించిన నాకర్ణించి పరమానందభరితస్వాంత యై యక్కాంతామణి యత్యంత