పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

81

   నమర నమృతాంధసులచేత నదియె మిగులఁ
   గోరఁబడుచుండుఁ గావున వారిజాక్షి.65

టీక. వారిజాక్షి = కమలములవంటి నేత్రములుగల యో పార్వతీ !, అమరన్ = ఒప్పునట్లుగా, అమృతాంధసులచేతన్ = అమృతమును పానము చేయునట్టిదేవతలచేత కూడ, అదియె = ఆరామనామమే, మిగులన్ = అధికముగ, గోరఁబడుచుండు కావునన్, (దేవతలు అమృతమును పానము చేసినవా రయ్యును, ఆరామనామమును మిగులకు శ్రద్దతోఁ గోరుచుందురు కావున) తవిలి = తత్పరులై (అనఁగా : రెండవ పనిలేకుండ అమృతులై రామనామమంత్ర ప్రభావమువలన మరణము లేనివారై అనఁగా : జననమరణ రూప మగుసంసారమునుండి ముక్తులై) శ్రీ రామనామసుధారసంబున్ = శ్రీరామనామామృతమును, క్రోలుభక్తులకున్ = పానముచేయు నుపాసకులకు, అమృతము = క్షీరసముద్రమునుండి చిలికి సంపాదించియున్న యమృతము, ఏల = ఎందుకు ?

తా. కమలములవలె విశాలనేత్రములు గలయోపార్వతీ! సంసారబంధవిముక్తులై (అనఁగా అహంకారమమకారముల బాధవలన బహుముఖములుగఁ దిరుగుచుండు మనసును నిలిపి పరమశాంతిని బూని) సర్వకాల సర్వావస్థలయందును రెండవపని లేక నీ శ్రీరామనామామృతమును పానము చేయుచుండు భక్తులకు, ప్రసిద్ధమగునమృతముతో పనియే లేదనుట నిశ్చయము. ఏల యనఁగా : మిగుల శ్రమపడి యమృతమును సంపాదించి, దానిని బానము చేయుటవలన జరామరణ భయంబులనుండి తొలగినవారైనను, దేవతలు ఆయమృతము మోక్షప్రదము కాకపోవుటచే శ్రీరామనామామృతమునే సర్వకాలములయందును గోరుచుందురు. ఇట్లుండ రామనామమంత్రసాధకునకు, క్షీరసముద్రములోఁ బుట్టిన యాయమృతముతో పనియేలేదుకదా!

తే. కోరి మును గాననిమనుష్యుఁ బేరు వాడి
   చీరిన నతం డతని చెంతఁ జేరినట్లు
   తన్నెఱుంగక తనపేరుఁ దలఁచినంతఁ
   గరుణచే రాముఁ డపుడె సాక్షాత్కరించు.66

టీక. కోరి = ఇష్టపడి, మునున్ = ఇంతకుపూర్వము, కాననిమనుష్యుని = చూడని మనుష్యుని, పేరువాడి చీరినన్ = పేరుపెట్టి పిలువఁగానే, అతండు = ఆ మనుష్యుఁడు, అతనిచెంతన్ = పిలిచినవాని సమీపమునకు, చేరునట్లు, తనున్, (రాముని) ఎఱుంగకన్ = తెలిసికొనకయున్నను, తనపేరున్, తలఁచినంతన్ = స్మరింపఁగానే, అపుడె = ఆక్షణముననే, రాముఁడు, కరుణతోన్ = దయతో, సాక్షాత్కరించున్ = ప్రత్యక్షమగును.