పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజిత రత్నప్రభలను
దేజఃపుంజంబు దోఁచి దిక్కులు వెలుఁగన్. 182

ఆ. రత్నగర్భపేరు ప్రకటించునది యొక్కొ
రత్నసానుమూల రత్నచయమొ
గంటిలేని మానికంబుల గని యొక్కొ
నాఁగ నవ్వెలుంగు వీఁగఁ బాఱె. 183

సీ. అందు నానారత్న సుందరప్రాంతమౌ
చంద్రకాంతాంచిత స్థలము కలిమి
జెరయు ముప్పదిరెండు పిల్లగద్దియల కా
భరణంబులౌ హేమపాత్రములను
రత్నదీపమ్ములు రమణఁ జేతులనున్న
పసిఁడి బొమ్మలును ముప్పదియురెండు
నింపైన నృపు నివాళింపు సొంపొందంగఁ
దత్సంఖ్య మణిమయద్వారములను
ఆ.వె. గలిగి నలుదిక్కు లన్నిచేతుల వెడల్పు[1]
చాపమాత్ర సమున్నతి నేపుమిగుల
విక్రమాదిత్యు లక్ష్మీనివేశకాంతి
నంతఁ గనుపట్టె దివ్యసింహాసనంబు. 184

క. తద్రూపముఁ గని నృపుఁడు ద
రిద్రుఁడు ధనరాశిఁగన్న రీతిం బ్రమదో
న్నిద్రితుఁడై తివిపింపఁగ
భద్రాసన మద్రిభంగి బరువై తోఁచెన్. 185

వ. తత్కారణం బెఱింగి మంత్రి యిట్లనియె. 186

  1. కలిగి నల్గడ నాల్గుచేతుల వెడల్పు