పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాని పిఱుంద నేగి నలువంకల నిల్వఁగ నందుఁ గొందఱా
లోనికిఁ జొచ్చి యావిజయలోలుని బాలునిఁ బోరఁ బిల్చినన్. 150

క. నాగేంద్రుఁడు జీవనవి
ద్యాగుణ మగు మంత్రశక్తిఁ దత్కృతములునౌ
నాగాశ్వరథ భటాదుల
కాగతిఁ బ్రాణంబు లిచ్చి యాత్మజుఁ బంపెన్. 151

గీ. ఆకుమారుఁడు శాలివాహనుఁ డనంగ
నెగడి నగరంబు వెలువడి నిలుచునంత
శేషు పంపున వచ్చి యాశీవిషములు
విక్రమార్కుని మూఁకల నాక్రమించె. 152

ఉ. సర్పము లీక్రియన్ భటులఁ జంపిన నాఁతడు వారిప్రాణముల్
గూర్పఁదలంచి వాసుకికి ఘోరతపం బొనరించి యయ్యెడన్
నేర్పొకయింతలేక యది నిష్ఫలమైనఁ గలంగియున్ భుజా
దర్పము తోడుగాఁగ నిది దైవవశంబని వచ్చెఁ బోరికిన్. 153

క. అతఁ డిటు వచ్చినఁ దక్కిన
హితులును సైన్యములు గూడ నేతెంచినఁ ద
చ్చతురంగబలము పైఁబడఁ
గుతలము పదహతుల నతలకుతలం బయ్యెన్. 154

వ. ఇట్లు తేజోవిక్రమార్కుం డగు విక్రమార్కుని సేనలు శేషప్రసాదవిశేషశాలివాహనుం[1]డగు శాలివాహను బలంబులుం దలపడి పోరు నవసరంబున. 155

సీ. కాలుబలంబులు గ్రాహసంగతిఁ గ్రాలఁ
దురగముల్ తరఁగల కరణిఁ జెలఁగఁ

  1. శాలిభానుండగు