పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. ఆతలఁపున వచ్చిన నతఁ
డాతెఱఁ గెఱిగించి యరయ ననిపిన పిదపన్
బేతాళుఁడు పాతాళము
భూతలమును నరసి వచ్చి భూపతితోడన్. 147

సీ. జననాథ! నీవు పంచిన నెల్లచోటులుఁ
దిరిగి ప్రతిష్టానపురములోనఁ
గుమ్మరి యింట లేఁగొమ్మముందట మంటి
బలములతో నాడెడుబాలుఁజూచి
యెవ్వరివాఁ డనునెడ నొక్కవిప్రుండు
తనకూఁతుకొడుకు తజ్జనని యిద్ది
యేఁటిపై నొకదినం బేగుచో[1] నాగేంద్రుఁ
డీపాపఁ గూడిన[2] నితఁడు పుట్టె
ఆ. దీనికారణంబు దేవర గాక యొం
దెవ్వఁ డెఱుగు ననుచు నిట్లు పలికె
నింక రాజ్యభోక మింకకుండఁగ నీవు
సాహసంబు సేయు సాహసాంక. 148

మ. అని చెప్పన్ విని యావలం దెలిసి సువ్యక్తంబుగా నాత్మనా
శనమూలం బని నిశ్చయించుకొని యాశ్చర్యంబుగాఁ దొల్లి చే
సిన కార్యంబులఁ దోడు వేఁడక మదిం జేట్పాటులం దోడువేఁ
డినఁ గష్టం బగునంచు దాఁగనియె భట్టిన్నిల్పి తానొక్కఁడున్. 149

ఉ. ఆ నరనాథుఁ డిట్లు చని యాయుధ మొక్కటి తోడుగాఁ బ్రతి
ష్ఠానపురంబు డగ్గఱునెడం జతురంగబలంబు లన్నియున్

  1. బేగిరి
  2. గోరిన