పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేరులు కలముల తెఱఁగున దిరుగంగఁ
గరులు మైనాకాదిగిరులఁ బోల
నరిగ బిళ్ళలు కమఠాకృతి మెఱయంగ
నడిదంబులును మీల ననుకరింపఁ
జామరంబులె సితచ్ఛత్రంబులును శంఖ
ఫేనసాదృశ్యంబు పేర్మి మెఱయఁ
గీ. బడగ లుత్పతత్ ఫణికుల భాతి వెలయ
రుధిరధారలు విద్రుమరుచిఁ దనర్ప
బటహరవములు జలఘోష భంగిఁ బొంగ
ముద్రమీఱిన రౌద్రసముద్ర మొప్పె. 156

ఉ. అత్తఱి వీరు లేర్చుక్రియ నార్చుచు వత్తురు వచ్చి మూఁకలోఁ
జొత్తురు చొచ్చి శత్రువులచొప్పు లడంతురు వారి బీరముల్
మెత్తురు మెచ్చిమార్కొనుచు మెల్పున గెల్చున భిన్నభిన్నమై
చత్తురు చచ్చి యచ్చరల సన్నిధి నిల్తురు గెల్తు రుద్ధతిన్[1]. 157

క. అయ్యెడఁ దెగియెడి వీరుల
నెయ్యమున వరించు వేల్పు నెలఁతలు దమలోఁ
గయ్యం బడువఁగ శూరుల
కయ్యము దివిఁజూడ నాఁడుఁ గయ్యం బయ్యెన్. 158

సీ. మ్రొగ్గెడు గజఘటంబుల నుబ్బి తేఱెడు
రక్తంబు మద్యపూరంబు గాఁగ
వారక తెగినట్టి వీరుల పునుకలు
కొమరారు పానపాత్రములు గాఁగ

  1. కల్తు రందఱన్