పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విక్రమార్కుని చరిత్రము


శా. రాజ్యం బేలుచు విక్రమార్కుఁడిట సంరంభోచితోజ్జృంభణ
ప్రాజ్యప్రాభవభసంభృతద్విపహయప్రారంభసైన్యంబుతో
సజ్యం బైనధనుర్బలంబు కలిమిన్ సామంతులన్ గెల్చి త
త్పూజ్యుండై ధనధాన్యలక్ష్మిఁ బరఁగెం బుణ్యం బగణ్యంబుగన్. 105

క. ఆతఁడు మహాకాళున కా
తత మగుతప మాచరించి తన కమరత్వ
స్థితివేఁడిన నరులకు [1]నిది
గతిపడ దొండడుగు మనినఁ గడిఁదిగ మఱియున్. 106

క. ఒకదివసం బెక్కుడుగా
నొకయేఁ డగు పిన్నపాప కుదయించిన బా
లకుచేతఁ గాని తాఁ జా
వకయుండను వేఁడికొనిన వర మతఁ డిచ్చెన్. 107

వ. ఇట్లిచ్చి. 108

క. వెయ్యేఁడులు రాజ్యసుఖం
బయ్యెడుఁ బొమ్మనిన దేవునానతి నారా
జియ్యకొని వచ్చి భట్టికి
నయ్యానతి క్రమముఁ జెప్ప నతఁడును మఱియున్. 109

క. నే మఱియును నొక వేయేం
డ్లీమహి యేలంగ నీకు నిచ్చెద నని భి
క్షామార్గి వగుచు రాజ్య
[2]వ్యామోహం బర్ధవర్ష మడఁచుము చాలున్. 110

  1. నీగతిపడదు
  2. వ్యామోహం బదియ నర్ధవర్షము చాలున్