పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గండలుఁదోలు [1]బొక్కలుగూడఁ బొదివిన
యాకృతి పసిఁడిసళాక యనుచుఁ
ఆ. [2]దెగడైన పెదవి త్రేగు డమృతమని
కవులు వొగడఁ బేరు గలిగెఁ గాక
తత్త్వ మెఱిఁగి యిట్లు తలపోసి చూచిన
నింతి రోఁత కెల్ల నిల్లుగాదె. 100

చ. అనుచు బహుప్రకారముల నంగనల న్మది రోసి యాత్మకా
మినులఁ బరిత్యజించి యిఁక మీమతి కింపగువారిఁ జేసికొం
డని సెలవిచ్చి రాజ్యసుఖమంతయు మాని విరక్తచిత్తుఁ డై
యనుజుని విక్రమార్కునిఁ బ్రియంబుగఁ బిల్వఁగఁ బంచి యిట్లనున్. 101

క. మనతండ్రి సౌరమంత్రం
బునఁ దపమొనరింప మెచ్చి మున్నర్కుఁడు దాఁ
దనయుఁడ నై పుట్టెదఁ బొ
మ్మని నీవై పుట్టె విక్రమార్కుం డనఁగన్. 102

ఆ. సర్వలక్షణముల సంపూర్ణుఁడవు నీవు
భట్టి మంత్రి గాఁగఁ బ్రజలనెల్ల
నేలు మంచు ముద్ర యిచ్చి దేశాంతరం
బరిగెఁ బరమయోగిచరితమునను. 103

క. అన్నరనాథుఁడు విడిచిన
యన్నులు మున్నూఱు నతని యనుమతి గలుగన్
మున్నూఱుఁ జేసికొని ధర
మున్నూఱుకులం బనంగ మొనసిరి [3]సిరులన్. 104

  1. డొక్కలు
  2. ఉమియు పెదవిత్రేగుడమృతంబటంచును --- నెగడైన పెదవి--
  3. మిగులన్