పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ. ఆఱునెలలు నగరియందు నిల్వుము మీఁది
యాఱునెలలు యోగివై చరింపు
పురి సహస్రవర్షములు చెల్లుఁ బొన్నూళ్ళ
నున్న వేయుఁ జెల్లుచుండు ననియె. 111

క. తద్వచనము నిజహితముగ
హృద్వనజములోఁ దలంచి యిల యెల్ల నుపా
యద్వయమున నరయుచు భూ
భృద్వల్లభుఁ డేలెఁ బ్రజలు ప్రియ మందంగన్. 112

వ. అంతనొక్కనాఁడు. 113

సీ. ఒక జోగి యతనిఁ గాటికిఁ దోడుకొని చని
బేతాళు రప్పించి ప్రీతి నునిచి
వేలిమిచేసి తా విపరీతగతిఁ బొందె
బేతాళుఁ డారాజు పెంపు మెచ్చి
యెడరైనఁ దలఁపుమీ యే వచ్చి పనులెల్ల
జేసేద మఱి యష్టసిద్ధు లొందు
ననిపోయె బ్రహ్మాదులును మీఁద విద్యాధ
రాధిపత్యం బగు ననుచుఁ జనిరి
ఆ. భూవిభుండు మగుడఁ బురముస కేతెంచి
సప్తసంతతులను సత్రములను
సంతతాధ్వరములఁ గౌంతేయుగతి శక
కర్తయై ధరిత్రిఁ గీర్తి నెఱపె[1]. 114

ఉ. సంతతదానధర్మగుణచారువిచారుఁడు వైరిచారదృ
క్కజ్జిలమార్జనప్రథమకారణచారుకృపాణపాణి వి

  1. గీర్తి నిలిపె