పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9

ప్రథమాశ్వాసము

కవివంశావతారవర్ణనము

క. తత్పదపద్మారాధన
   తత్పరులను రాజమంత్రిధర్మజ్ఞుల మా
   సత్పురుషుల వినిపించెద
   మత్పారంపర్య మొకక్రమంబునఁ దెలియన్. 41

సి. కలుషమండలికభేకఫణీంద్రుఁ డన
             రాయగజగంధవారణఖ్యాతి మెఱసి
    వీరఘోట్టవిభాళుఁ డారూఢబిరుదవి
            రోధి కళింగనిరోధి యనఁగ
    వెలసి నానాఁటికి వెలనాటి పృథివీశ్వ
            రుని రాజ్యభారధుర్యుం డనంగ
    నారెలు గన్నడీ లఱవలుఁ దెలుఁగులు
            దనబిరుదందియఁ దగిలికొలువ
ఆ.వె. నెగడి సనదప్రోలు[1] నెలవుగా భూసుర
    వంశ సాగరామృతాంశుమూర్తి
    చక్రవర్తిమాన్య సౌజనధన్యుండు
     విక్రమార్కనిభుఁడు వెన్నవిభుఁడు. 42

ఉ. సాంద్రజవంబున,[2] న్మతి,నిజస్థితి,నేర్పునఁ,బేర్మి,సత్యవృ
    త్తిం, ద్రుతబాణ[3]పాతనిరతిం, గళల, న్సరివత్తు రెట్లు ప
    క్షీంద్రుఁడుఁబన్నగేంద్రుఁడు నగేంద్రుఁడుపేంద్రుఁడు నింద్రుఁడున్ హరి
    శ్చంద్రుఁడు రామచంద్రుఁడును జంద్రుడు వెన్నయమంత్రిచంద్రుతోన్[4]. 43
 
క. అమరఁగ వెన్నయమంత్రికి
    నమితకళాకీర్తిపాత్రుఁ డగుపౌత్రుం డై

  1. సందప్రోలు
  2. సాంద్రబలంబున
  3. ధృఢబాణ
  4. చంద్రుకున్