పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
8

సింహాసన ద్వాత్రింశిక



   
    స్కరచంద్రోదయ రణగతి
    గిరి వన దూతర్తురతులఁ గృతి చెప్పఁదగున్. 37

క. కావునఁ బదునెనిమిది యగు
   నీవర్ణన లచటనచట నించుక బెరయం
   గావించెద నిటఁ బని కివి
   రావనకుఁడు లక్షణాభిరామము లగుటన్[1]. 38

వ. అని విన్నవించి కృతకృత్యుండ నై సింహాసనద్వాత్రింశతి కథాకథనమూలకారణం బైన యంబికారమణుండును మత్కవితాసంపత్తి సంధాయకుండగు [2] లక్ష్మీనాయకుండును గావ్యనాయకులుగా నియమించుటఁజేసి. 39

సీ. పాఁపపెండెముగాక పసిఁడియందియయును
        నడుగుఁదామరలపై నమరువాఁడు
   పెద్ద మెకముతోలు నిద్దంపుఁబట్టును
        మొలదిండుగాఁ గట్టి మురియువాఁడు
   ఎముకపూసలును ముత్యములుఁజేరులు గాఁగ
        నక్కునఁదాల్చి పెం పెక్కువాఁడు
   పునుకయుం బెనుగుల్లయును గేలుదమ్ముల
        సంచలమాడ్కిఁ బాటించువాఁడు
గీ. సగముపొడవునఁ దెల్పు నాసగము నల్పు
   నయ్యు మెడ నొక్కవన్నియ యగుచు మేను
   లెనయ ముక్కంటియును వెన్నుఁడును ననంగఁ
   బొల్చు నావేల్పు కబ్బంబుఁ బ్రోచుఁ గాత. 40

  1. మొరయన్ , మెరయన్
  2. ముక్తవితానసమ్పద్విధాయకుండు