పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
10

సింహాసన ద్వాత్రింశిక

    యమరేశ్వరమంత్రినిభుం
    డమరేశ్వరమంత్రి వెలసె నార్యులు వొగడన్. 44

క. [1]సంగతినమరేశ్వరునకు
    గంగాంబకుఁ బుట్టి రట్టి ఘను లన్నయయున్
    సింగయమంత్రియుఁ దమలో
    నంగీకృత రామలక్ష్మణాకారములన్. 45

ఉ. అన్నయనామధేయసచివాగ్రణి పుత్రుఁడు పెద్దిరాజు సం
   పన్నిధి [2]పల్లికొండజనపాటఁడు మల్లనదేవరాజుచే
   నెన్నఁగఁగుంచె లందలము నెల్లియుఁ గైకొని మంత్రియై ప్రతా
  పోన్నతి కెక్కె ధర్మముల నొప్పెడు బ్రహ్మవనప్రతిష్ఠలన్. 46

చ. అనఘులు సింగనార్యునకు నబ్బయ గోపయమంత్రి సత్తెనా
    రన యనఁ గల్గి రాత్మజులు రాములు మువ్వురు దోఁచినట్లు పెం
    పున వెలయంగ నబ్బయకుఁ బుత్రులు పుట్టిరి రామరాజుఁ గే
    సనయును బాచిరాజు గుణసాంద్రుఁడు సింగనయుం గ్రమంబునన్. 47

క. ఘను లగ్రజులకు నీడై,
   వనములు, గ్రతువులును గృతులు వడి నిల్పిరి బా
   చనయును సింగనయును దగి
   కనపోతకుమారసింగయకు మంత్రులనన్. 48

క. [3]రామాయణకృతి కృతియై
    తామెఱయుచు నంధ్రకవిపితామహుఁ డనఁగా

  1. గంగాంబకుఁ బుట్టిరి భువి, నంగజసన్నిభులు ఘనులు అన్నయయు సింగయ మంత్రియు
  2. పల్లకొండ గుణసంగుఁడు సింగనయుం బ్రియంబునన్
  3. రామాయణ కృతిపతియై