పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vi


బడుటయే. దాని సామంజస్యమును గమనింతము. కవి వంశావతారికలో వేన్నామాత్యునకు పౌత్రుడు అమరేశ్వరుడని చెప్పినట్లే, ఆశ్వాసాంత్యగద్యలలో "శ్రీ కొరవి వెన్నామాత్యపౌత్ర కసవరాజ తనూజ గోపరాజ విరచితంబైన సింహాసన ద్వాత్రింశిక" అని తనను గూడ పౌత్రునిగా చెప్పెను. దీనిని బట్టి గోపరాజునకు అయిదవ పురుఘడగు అమరేశ్వరుడు వెన్నయకు సాక్షాత్ పౌత్రుడు గాడని ఆ వంశములో కొన్నితరములు గడచిన తరువాత పుట్టినవాడని గట్టిగా చెప్పవచ్చును. ఇందువలన వెన్నామాత్యుని కాలము నుండి తరమున కన్ని వత్సరములని గుణించు బాధ తప్పినది,

గోపరాజు కాలమును తెలిసికొనుటకు రెండు ఆధారములున్నవి. ఒకటి గోపరాజు పెదతాత కుమారులు బాచన సింగయలు రాచకొండ రాజగు అనపోత కుమార సింగయ కడ మంత్రులుగా ఉండుట. ఈ సింగభూపాలురు మువ్వురున్నారు. వీరిలో అనపోత నాయకుని కుమారుడు కుమార సింగ భూపాలుడు క్రీ.శ 1430..1475 వరకు పాలించినవాడు. ఇతని కడనే బాచన సింగనలు మంత్రులుగా ఉండినట్లు తలచవచ్చును. ఇతని కోరిక పైననే బమ్మెర పోతన 'భోగినీదండకము'ను రచించెను. గోపరాజు ఈ కాలమునకు ఒక తరము తరువాత ఉండవలెను. రెండవ ఆధారము గోపరాజు పూర్వక ఏ స్తుతిలో పిల్లలమఱ్ఱి వీరరాజును పేర్కొనుట. ఆ వీరరాజు పిల్లలమఱ్ఱి పిన వీరభద్రుడనియే పలువురు పండితులు అభిప్రాయపడినారు . జైమిని భారతమును రచించి పినవీరభద్రుడు 1485-1490 సంవత్సరములలో విజయనగర సామ్రాజ్యమును పాలించిన సాళువ నరసింహ రాయలకు అంకిత మిచ్చెను. దానినిబట్టి గోపరాజు పిన వీరభద్రునకు తరువాత కొద్ది కాలముననే ఉండునని శ్రీ ఆరుద్రగారి అభిప్రొయము. శ్రీ లక్ష్మీకాంతము గారు పిన వీరభద్ర, గోపరాజులు సమవయస్కులు కాకున్నను సమకాలికులై యుందురని చెప్పిరి.

డా|| నేలటూరి వెంకటరమణయ్య గారు గోపరాజు పేర్కొన్నవాడు పినవీరభద్రుడు కాడనియు, అతని అన్న పిల్లలమఱ్ఱి పెదవీరరాజు కాదగు