పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హీనకవిత్వ మైన మెఱుఁ గెక్కదె [1]నేర్పరులైనవారిచే
సానలఁబట్టి తీర్చినను సన్నపురత్నము వన్నెకెక్కదే. 15

ఉ. భావరసానుకూల మృదుపాక పదార్ధ సమృద్ధి లోక సం
భావన నొప్పు కావ్యముల మర్మము[2] గానగ లేక దుర్మతుల్
కా వన గాని యెట్టి కడగట్టిడి జెప్పగ నేర; రెల్లెడం
ద్రోవనగాక కుక్కలకు దొంతులు వేర్వగ నేర్పు గల్గునే.

16 చ. చులుకని పద్య మైనఁ గడుఁజోద్యము చేయుచుఁ జిన్నవానిఁ బె
ద్దలు గొనియాడఁగాను విని తప్పులు పట్టఁదలంతు రక్షముల్
బిలిబిలి మాట లాడఁ దనుఁ బెంచినవానికి ముద్దుగాక యా
పలికెడు చిల్కపిల్లఁగని బావురుఁబిల్లులు[3] సంతసిల్లునే. 17

ఉ. భీమనపద్య మన్నఁ గడుఁబ్రీతి వహించుచు మేలుమేలు నా
నే మిది చెప్పినార మన నిక్కమె ప్రాసము గూర్చినాఁడ వౌ
నే మిది కాదు దీనివడి కిక్కడి కర్థ మిదెట్టి దీగణం
బే మని పెట్టినాఁడ వని యెగ్గులుపట్టుఁ గుబుద్ధి పెద్దలన్. 18

క. వివరికి వివరించిన కృతి
చవిసాలం బంచదార సరి గూర్చుట యా[4]
యవివేకికి వినిపించిన
కవిత వఱుతఁ జింతపండు గలుపుట చుమ్మీ. 19

ఉ. పూనినరీతి వానితలఁపు ల్వడిఁ బ్రాసములుం జలంబునం
బానగిలంగ నీడ్చి యొకపద్యముఁ గూర్పఁగవచ్చుఁగాక యా
ఖ్యానకథానుకూలముగఁ గావ్యముఁ జెప్ప వశంబె సన్నమై
కానఁగ జల్లి నేయునది కట్టెడుపుట్టము నేయనేర్చునే. 20


  1. 1 నేర్పరులైనవోజులై
  2. 2 పద్ధతి
  3. 3 బాగురుఁబిల్లులు
  4. 4 గూర్చునునా