పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

5


క.

ఉర్విఁ గల శబ్దజాలము
నిర్వచనస్థితుల నెఱిఁగి నేర్పున విద్యా
నిర్వాహకుఁ డనఁజెల్లెడు
సర్వజ్ఞుఁడు గానివాఁడు సత్కవి యగునే.

21


క.

ఎప్పటి కేయది ప్రస్తుత
మప్పటి కావిద్య మర్మ[1]మచ్చుపడంగాఁ
జెప్పక సర్వజ్ఞత్వము
చొప్పడునే కావ్య మంత సులభమె ధాత్రిన్.

22


క.

దుర్వాదము గాకుండ న
పూర్వపుఁగృతిఁ జెప్పుసుకవిపుంగవునకుఁ దా
సర్వజ్ఞుఁడ నని మాటల
గర్వింపఁగనేల తొడవు గానంబడఁగన్.

23


క.

చనుఁ “గవివైభవవిద్యా”
యని చదువుటఁ గావ్య మధిక మదియును నల్లి
ల్లును గుడియుఁ జెఱువు నిధియును
వనము సుతుఁడు సంతతులు భవస్థితిగతికిన్.

24


క.

ఎవ్వరు కృతు లొనరింపుదు
రెవ్వరు కృతిలోన వినుతి కెక్కుదు రొరుచే
నవ్విమల[2]కీర్తిసంతతు
లివ్వసుమతిఁ జెడక నిలుచు నినకల్పముగన్.

25


క.

సుగుణులు “బాణోచ్ఛిష్టం
జగత్రయ” మ్మనఁగఁ గొంత చదువఁగఁ బ్రియమే


  1. మహిమమచ్చు...జెప్పెడు
  2. నవ్విభుల