పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   శ్రీభారతిగతిఁ జెప్పిన
   నాభావురమును[1] దలంతు నన్నయభట్టున్. 10

క. లేముల వాడక శుచియై
    [2]లేములవాడం జరించు లేములవాడం
    దా మెఱసిన భీముని నుత
    భీముని బలభీము విమతభీమునిఁ దలఁతున్. 11

చ. అనఘు హుళక్కి భాస్కరు, మహామతిఁ బిల్లలమఱ్ఱి వీరరా
    జును, ఘను నాగరాజుఁ, గవిసోమునిఁ, దిక్కనసోమయాజిఁ, గే
    తనకవి, రంగనాథు, నుచితజ్ఞుని నెఱ్ఱన, నాచిరాజుసో
    మన, నమరేశ్వరుం, దలఁతు మత్కులచంద్రుల సత్కవీంద్రులన్. 12

వ. అని యిట్లు సకలవరప్రదానకారణదేవతలను జతురహృద్యానవద్యగద్యపద్యవిద్యావిద్యోతితు లయిన
    కవీశ్వరుల నుం బ్రశంసించి తత్ప్రసాదాసాదితసహజసాహిత్యతరంగితాంతరంగుండ నై సకలజనసాధారణం
    బగునట్లిట్లని విన్నవించెద [3]. 13

ఉ. ఆదరణంబు లేక చెడనాడిన బాణమయూరకాళిదా
    సాదులకైనఁ దప్పు గల దన్యుల కే మని చెప్ప వీనితో
    నేదియుఁ గాదు పొ మ్మనక యిందులచంద మెఱింగి తప్పినం
    గా దని తీర్చి యొప్పు గని కైకొని మెత్తురు గాక సత్కవుల్. 14

ఉ. [4]మానుగఁ దప్పులున్న ననుమానము సేయక మోదమానస
      న్మానను లైనవారు పలుమాఱు పరీక్ష [5]లొనర్చి తీర్చినన్.

  1. నా భరతుండని, నాభావకుఁడని
  2. వే, లే, యని రెండుప్రతుల రెండురీతులు (వేములవాడ, లేములవాడ)
  3. 3 వితర్కించెద, వినిపించెద
  4. 4 మానము దప్పనీక
  5. 5 లొనర్చిరేనియున్