పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఉ. నిద్దములైన భూషణమణిప్రకరద్యుతు లన్నిదిక్కులన్
    దొద్దలువుచ్చి తల్లిచనుదోయిసరిం[1] దలకట్టు మించఁగా
    ముద్దులు సూపుచుం బసిఁడిముద్దగతిం దొడమీఁదనాడు నా
    ముద్దుగణేశునిం దలఁచి మ్రొక్కెద నీకృతికార్యసిద్ధికిన్. 5

క. రుణ్మదపరివృదసురగణ
    తృణ్మోచను సురశరణ్యు ధృతశక్తి ఫణి
    ద్విణ్మయవాహను, హరినిభు[2]
    షణ్ముఖు నభిముఖినిగాఁ[3] బ్రశంసింతు మదిన్. 6

క. ప్రవిమలుఁడని గ్రహరా జని
    కవితాప్రియుఁడని జగత్ప్రకాశకుఁ డనియున్
    భువి విక్రమార్కనృపసం
    భవకారణుఁడనియు[4] లోకబాంధవుఁ దలఁతున్. 7

క. పులుఁగునకై యెవ్వనిమది
    నొలికిన శోకము లకారయుతమై కవితా
    కలనకుఁ దెరు వయ్యెఁ దలం
    పుల నాతనిఁ గొల్తుఁ బుట్టఁ బుట్టిన సుకవిన్. 8

ఉ. శ్రీనిలయంబునాఁగ మురజిద్గుణరత్ననివాసమై యుపా
    ఖ్యానతరంగిణీభరితమై కడగానఁగరాని భారతా
    ఖ్యానపయోధిలోనఁ గల మై నిజయుక్తి భజింపఁ గర్ణధా
    రానుకృతిం గృతార్థత మహాఘనుఁడౌ మునిఁ బ్రస్తుతించెదన్. 9

క. ఆ భారతపర్వత్రయ
     మీ భారతవర్ష మెల్ల నెఱుఁగఁ దెనుఁగునన్

  1. నడిం
  2. హరిక్రియు, హరిప్రియ, హరిశిఖుఁడు.
  3. నతిసుముఖుఁగా
  4. కారణమనియు.