పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వాదశాశ్వాసము

477


కినియై యీమసనములో
నను రాత్రులు దిరుగు నది దిగంబర యనుచున్.

54


క.

ఈ రాత్రి నీకుమారుని
మారిమసఁగినట్లు చంపి మలయఁగ నేనా
ఘోరాతిశూలనిహతిఁ ద
దూరుస్థలి నొంచి చరణ మొడియఁగ నెగసెన్.

55


క.

కాలు విదిర్చిన నందియ
కీలెడలినఁ బుచ్చుకొంటి క్షితినాయక యే
స్త్రీలను జంపరు గావున
నాలలనను వెడలననుపు మంతియ చాలున్.

56


క.

అనవుడు వెరఁగంది భయం
బున మంత్రితనూజసౌధమున కంగనలం
బనిచి తొడపైఁ ద్రిశూలం
బునఁ బొడిచిన యట్టులున్న [1]పోటులు దెలిసెన్.

57


ఆ.

తెలిసి శోకరోషకలుషుఁడై యారాజు
మగిడి పురికి నేగి మంత్రికూఁతు
దయ్య మనుచుఁ బ్రజలు దలఁకఁగా వెడలగొ
ట్టించెఁ జూడ నిది కడింది యనుచు.

58


శా.

ఆకన్యామణి దుఃఖమూలమునఁ బ్రాణాంత్యంబు చింతింపఁగా
నాకాశీపురరాజపుత్రకుఁడు వ్యక్తాకారుఁడై తన్మన
శ్శోకం బార్చుచు [2]వేడ్కజోగిఁ దనయిష్టంగా నెఱింగించి య
స్తోకం బౌ నిజరాజ్యముం దెలుపుచుం దోడ్కొంచు నేగెం బ్రియన్.

59
  1. భూపతి దెలిసెన్
  2. వెడ్డుజోగి