పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/539

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

478

సింహాసన ద్వాత్రింశిక


క.

తదనంతరంబ యొక నా
ల్గుదినములకు దంతఘట్టకుఁడు సతియును దా
మదిఁ [1]గూఁతుశోకదహనము
పొదివిన బరలోకమునకుఁ బోయెం బెలుచన్.

60


క.

ఆపాపము గడపటఁ గా
శీపతిపుత్రుండొ యతనిచెలికాఁడో యీ
భూపాలుఁడొ వీరలలో
నేపురుషుం డొందుఁ జెప్పు మెఱిఁగినకొలదిన్.

61


సీ.

ఎఱిఁగి చెప్పకయున్న నిప్పుడే నీతల
        పదివ్రక్కలై పడు నిది నిజంబు
కావునఁ జెప్పుమా నావుడు నిఁక నూర
        కుంట మోసం బని యుర్వివిభుఁడు
కామాతురుం డౌచుఁ బ్రేమ రాకొమరుండు
        [2]తనదానిఁగాఁ జేసికొనుట తగవు
సచివసూనుఁడు నిజస్వామికార్యమునకు
        మర్మంబు సేయుట ధర్మపథము


ఆ.

తలవరులచేత వానివర్తనము లెల్ల
మొదలఁ దెలియక యది నిజంబుగఁ దలంచి
చేసెఁ గావున దురితంబు చెందుఁ బ్రభుని
రాష్ట్రకృతమైనపాపంబు రాజుఁ బొందు.

62


క.

అనవుడు బేతాళుఁడు నె
మ్మనమునఁ గొనియాడి యతని మౌనత్యాగం

  1. గూరుశోకదహనంబున
  2. తనపనిఁగా