పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

457


నధిపునవయవంబు లాయొడ్డనంబుతో
గూడఁ దిగిచి బెగడుగొనక పలికె.

143


క.

ఓనరనాయక యిం కిట
నే నుండుట తగదు సమరనిహతుని వీరు
న్నానాథుఁగూడ నేగెద
నానతి యీవలయు నాకు నగ్గి సొరంగన్.

144


క.

[1]నా విని మొదలనె యాతని
చావున కతిఖిన్నుఁడైన జనపతి కృపతో
నోవీరపత్ని జనకుని
కైవడి నినుఁ బ్రోతు నిట్లు గడఁగకు మనియెన్.

145


క.

ఇది చాగెడుకొఱకై నీ
పదములకడ నుంచె నిట్లు పతిపోయిన స
త్పదమున కేగెద ననుపుట
మదిఁ జూడఁగ నిదియె తండ్రిమన్నన గాదే.

146


ఉ.

ఆకులపాటుతోడ నశుభాకృతియై యొకవేళనైనఁ బోఁ
కాకును లేక సొమ్ములకు నఱ్ఱులు సాఁపక పేరఁటంబులం
బోక తొఱంగి పూఁతలును బువ్వులు దూరముగాఁగ ముండయై
యేకడఁ జేరిన న్విధవ కెగ్గులె కాక [2]భరింపవచ్చునే.

147


క.

చచ్చియుఁ జావక తనలో
వెచ్చుచు నియమముల నింక విధవాత్వమున
న్నిచ్చలు మాఁడుటకంటెను
జిచ్చుఱుకుట మేలు సతికి క్షితి మెచ్చంగన్.

148
  1. ఆవీరభటుని చావునకై
  2. చరింపవచ్చునే, తరింపవచ్చునే, ధరింపవచ్చునే