పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

458

సింహాసన ద్వాత్రింశిక


క.

పతి దుఃఖితుఁ డైనను దా
నతిదుఃఖిత యగుచు నూరి కతఁ డరిగిన బీ
డిత యగుచు నతఁడు సచ్చిన
ధృతితోడన సచ్చునది పతివ్రత చుమ్మీ.

149


ఆ.

పుట్టలోనిపాముఁ బట్టు గారడికుండు
బలిమి వెడలఁ దిగియు పగిది నింతి
తోడఁ జచ్చి పతి యధోగతుఁ డైనఁ దా
నుద్ధరించి సౌఖ్య మొందుచుండు.

150


ఆ.

అతని కేమి కొఱఁత పతిహితంబునఁ బ్రాణ
మిచ్చినాఁడు దివికి నేగినాఁడు
రమణుఁ డగుచు నచట [1]రంభాదిసతుల గూ
డ్కొనకమున్న నన్ను గూడ ననుపు.

151


ఆ.

ఉరక మాన్పితేని నురి వెట్టుకొని యొండె
గుండు గట్టి నీళ్ళఁ గూలి యొండె
విషము ద్రావి యొండె విడుతుఁ బ్రాణంబు లా
తగనిచావు కీడు దగులు నిన్ను.

152


సీ.

[2]అటుగాక పుణ్యమౌ నగ్నిప్రవేశంబు
        చేయింపు మాకీడు చెంద దిందు
నెన్న ముక్కోటియు నేఁబదిలక్షలు
        మానవు మేన రోమంబు లుండు
నన్ని యేఁడులు స్వర్గ మాత్మనాయకుతోడ
        ననుగతయౌ సతి యనుభవించు

  1. రంభాదిసతులను గూడకుండ - రంభాదులను గూడుకొనక మున్న
  2. అటుగాన యుక్తమౌ