పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

456

సింహాసన ద్వాత్రింశిక


క.

మిన్నంట నెగసి నరులకు
గన్నంటిన యంతదవ్వుఁ గానంబడి య
తున్నతగతిఁ గనుపట్టక
చన్నం గని చోద్య మందె జనపాలుండున్.

140


సీ.

ఆమీఁద దేవాసురాహవం బైనట్లు
        పంచమహావాద్యఫణితు లెసఁగెఁ
బొడుపుఁడు తల ద్రెంచుఁ డడువుఁడు నా నిట్లు
        పెడబొబ్బ లార్పులు ముడులు వడియె
నంతలోపల హనుమంతునొడ్డనముతోఁ
        గూడ నాతని చేయి గూలె ధరణిఁ
దరువాత వాలుతో దక్షిణహస్తంబు
        నందియతోఁ గాలునట్లు వడియెఁ


ఆ.

దోడికాలును దెగి తొఱఁగెఁ జెంగులపాగ
బొల్లియంబుతోన ద్రెళ్ళెఁ దలయు
ద్రిండుతోడఁగూడ [1]మొండెము దిగదొర్లె
గొలువులోనఁ జూడ ఘోర మయ్యె.

141


ఉ.

ఎక్కడినుండి వచ్చె నితఁ డెవ్వఁడొ యింద్రునిబంట నంచుఁ దా
నిక్కమలాక్షి నుంచి దివి కేగి సురాసురసంగరంబునం
గ్రక్కున నొక్కఁ డిట్లు కడికండలు నయ్యె నటంచుఁ గొల్వులోఁ
బెక్కువిధంబుల న్భటునిఁ బేర్కొని విస్మయమంది రందఱున్.

142


ఆ.

మీఁది ముసుగు వుచ్చి మెలఁతుక యలకలు
చక్కదువ్వి యప్పు డక్కజముగ

  1. గుండములు ద్రెళ్ళె - నెడమకాలును దెగి పుడమి బడియె
    గుండలములు ద్రెళ్ళె