పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xlvi


 శరణము పగవారలకును
 మరణము నాఁజెల్లు నీతిమంతుండైనన్. (11 - 95, 101)

19. సేవకుని విధులు- మూలమునలేని సేవకవిధులు, ఉత్తమభృత్య లక్షణములు, దుష్టసేవక లక్షణములు వివరింపబడినవి. ఇందు లేఖక, లెంక శబ్దములు పర్యాయ పదములుగా వాడబడినవి. లేఖక పదము నుండియే లెంక వచ్చియుండును.(11-106)

20. చతుష్షష్టికళలు- మూలమున లేకున్నను చతుర్దశ విద్యలను, చతుష్షష్టి కళలను ఒక దీర్ఘ వచనమున చెప్పేను. (11-168)

21. ఛందోవిశేషములు - మూలమున లేని ఛందో విశేషములను గోపరాజు చెప్పెను. దండకారణ్యమును వర్ణించు సందర్భమున 13 ఛందములు మాత్రము చెప్పబడినవి (5-54). అందును అనుష్టుప్, త్రిష్టుప్, జగతి, అతిజగతి, శక్వరి, అతిశక్వరి ఛందములలో బుట్టినవని కవిజనాశ్రయకారుడు చెప్పిన వృత్తములను వదలి క్రొత్త వృత్తములను గోపరాజు చెప్పెను. హరిణీవృత్తము అష్టిఛందములోనిదిగా మార్చెను. ఆ తరువాత ధృతి, కృతి, ప్రకృతి, సంకృతి, ఉత్కృతి ఛందములలోని వృత్తములను కవిజనాశ్రయము నుండియే గ్రహించెను. అందు 26 ఛందములు పేర్కొన బడినవి.

తొమ్మిదవ బొమ్మ కథలో ఆంధ్రచ్ఛందో విశేషములను, అందును యతిప్రాసలను, ప్రసక్తి కలిగించుకొని చెప్పినాడు. తెలుగు కవితకు యతులు ప్రాసలు ముఖ్యములని తెలిపి, పదమూడు విధములైన వళ్ళు చెప్పినాడు. యతిని వడి ఆందురు. గోపరాజు కవిజనాశ్రయచ్ఛందస్సును అనుసరించెను. అందు స్వరయతి, వర్గయతి, అఖండయతి, ప్రాదియతి, బిందుయతి, ప్లుతయతి, సంయుక్తాక్షరయతి, ఎక్కటియతి, పోలికయతి, సరసయతి అను 10 విధములు చెప్పబడగా, గోపరాజు వాటికి వ్యంజనయతి, గూఢస్వరవ్యంజన