పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xlvii


యతి, వృద్ధియతి అను మూటిని చేర్చి 13 వళ్ళను చెప్పినాడు. అఖండయతి బిందుయతులను నిత్యసమాసయతి, అనుస్వారయతి అని మార్చెను. ప్రథమ పరిష్కర్తలు గోపరాజు అఖండయతిని చెప్పలేదను ని ఒక పద్యము నందలి ఆప్రయోగమును మార్చిరి.

"... ... దేవేంద్రువీడ్కొని తేరిమీద
 నిడికొని యుజ్జయినికి దెచ్చి వేడ్కసిం
 హాసనంబెక్కి యాయవనివిభుఁడు” (1-137)

అని యున్నదానిని “నిడికొని యుజ్జేని కేతెంచి వేడ్క "అని సవరించిరి. 'ఇడికొనికి' 'నిడికొని' రూపాంతరమున్నట్లు భారత ప్రయోగమును బట్టి సమర్థింపవచ్చును (ఆదిపర్వము). కాని గోపరాజునకు అఖండయతి సమ్మతమే అగునని క్రిందిపద్యము వలన చెప్పవచ్చును,

"డాయఁగ సమసింపఁగఁ బా
 రాయణ నారాయణాంతరంగా నేకా
 నాయాసాదులఁ గర్ణర
 సాయనముగ రెండువళ్ళు జరుగుచునుండున్" (4-207)

 అట్లే బిందుయతిని గూడ వాడినాడు.

 “గం, డక శార్దూల వరాహ సింహ కరిగణ్యంబౌ నరణ్యానికిన్ (3-12)

గోపరాజునకు తరువాత 17 శతాబ్దివాడైన కూచిమంచి తిమ్మకవి తన “సర్వ లక్షణ సారసంగ్రహము"లో 22 వళ్ళను చెప్పి ప్రాదియతులకు గోపరాజు పద్యమునే ఉదాహరించెను. అప్పకవి అనవసరముగ విభజించి 41 యతిభేదములను చెప్పినాడు.

కవిజనాశ్రయమున 6 విధములైన ప్రాసలు చెప్పబడినవి. గోపరాజు వానినే గ్రహించి అందలి సుకరప్రాసమును వదలి చతుఃప్రాసమును