పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

396

సింహాసన ద్వాత్రింశిక


శా

ప్రాతఃకాలమునందుఁ గొల్వున నయప్రఖ్యాతులౌ రాజులు
న్నీతిన్యస్తమనస్కులౌ సచివులు న్విద్వాంసులుం గొల్వఁగా
జ్యోతిర్మధ్యమున న్వెలింగెడు హిమాంశుంబోలి సొంపొందుచో
జ్యోతిశ్శాస్త్రవిదుం డొకండు ధరణీశుం గాంచి దీవించుచున్.

5


సర్వశుభంబులు నీకడ
నిర్వాహము గలిగియుండు నీ కేమని యా
శీర్వాదం బొసఁగుదు [1]నా
యుర్వృద్ధి దలంప నవియ యునికికిఁ గోరున్.

6


ధరణిమీఁద నధికదానధర్మక్రియా
పరున కాయు వది యపార మగుట
తెల్లమనుచుఁ బలికి తిథివారనక్షత్ర
యోగకరణములను నొప్పఁజెప్పె[2].

7


సీ

ఐదింటఁ దా నొప్పఁ డట నెన్మిదింటఁ దొ
        మ్మిదియింటఁ బండ్రెంట మేలు శుక్రుఁ
డిందుఁ డాఱింటను నేడింట మూఁటను
        బదిటఁ జేకొన్న శుభప్రదుండు
శనిరాహుకేతుభూతనయసూర్యులు మూఁట
        నాఱింట మేలర్కుఁ డట్ల పదిట
రెంట నైదింట నేడింటఁ దొమ్మిదిటను గు
        రుం డున్న నెల్లకోర్కులు ఫలించు


బుధుఁడు బేసిగానిపొందుల నిష్టుఁడౌ
వీని కెల్ల దుష్ట వేధ లేమి

  1. నాయుర్వర్ధన మదియె తనకు నునికిం గోరున్ - నాయుర్వృద్ధి దలంప నలవి యున్నది మీకున్
  2. సయుక్తిఁ జెప్పె