పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

397


ఫలము రొప్పు జననభవనంబు మొదలుగా
బదునొకంట నున్నఁ బరమసుఖము.

8


గీ.

[1]అందు రవితనుజాది మహాగ్రహంబు
లిప్పు డాఱింట నునికి నీయిష్ట మొనరు
గురుఁడు బుధుఁడును బై పయికొనుట మేలు
శుక్రచంద్రులు మూఁట నిల్పుట శుభంబు.

9


వ.

అనుచు శుభస్థానంబులు నతని గ్రహంబులునుం జెప్పి.

10


క.

“ధర్మే తిష్ఠతు తే బు
ద్ధిర్మనుజాధీశ" యనుచు దీవించిన ద
న్మర్మం బెఱింగి నృపుఁ డా
ధర్మముచొ ప్పెట్టి దనిన దైవజ్ఞుండున్.

11


క.

నీ వది యెఱుఁగవె ధర్మము
త్రోవం జనువాఁడు భక్తితోఁ దనశక్తిన్
దేవబ్రాహ్మణపూజలు
గావింపఁగవలయు విగతకల్మషుఁ డగుచున్.

12


క.

గురువును దేవరగా స
త్పురుషుని గురువుగ నిజాశ్రితుని ప్రాణముగా
బరవనితఁ గన్నతల్లిగ
బరధనము విషంబు గాఁగ భావింపఁదగున్.

13


గీ.

అన్నదానము దుర్భిక్ష మైనయప్పు
డంబుదానంబు నిర్ణలం బైనచోట
నభయదానంబు శరణార్థియైనవేళ
జేయు టుచితంబు ఘనదయాశీల మలర.

14
  1. అందు రవిదనుజమంత్రి ముఖ్యగ్రహమ్ము