పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

384

సింహాసన ద్వాత్రింశిక


[1]ప్రబలమైనధనవిభాగముల్ దీఱక
వైశ్యసుతులు కోరి వచ్చి రటకు.

94


ఆ.

వచ్చి సాగి మ్రొక్కి వసుమతీనాయక
నలుపురమును సోదరులము మేము
విన్నవింతు మొకట వినుము 'పురందర
పుర' మనంగ నొక్కపురము గలదు.

95


క.

సుందరులు మేనకొదులఁ
గ్రిందుపఱుపఁ బురుషు లమరకిన్నరులను లీ
లం దెగడఁగ నాపురికిఁ బు
రందరపుర మనఁగఁ జేరు రమణీయ మగున్.

96


ఉ.

ఆపురమధ్యమంబున మహారజతాంచితకుంభదీప్తి సం
దీపిత మైన మేడ హిమదీధితిబింబము మీఱు నందు [2]సు
స్థాపితవైభవుండు ధనదత్తుఁడు మజ్జనకుండు వైశ్యము
ద్రాపరిపాలకుండు ధనదప్రతిరూపకుఁ డుండుఁ బెంపునన్.

97


చ.

సదమలచిత్తుఁడౌ నతని సద్మమునన్ ఘటసన్నిభంబులౌ
పొదుగులపాలు క్రిక్కిఱిసి భూమి తదీయయశస్వరూపమై
చెదరఁగ మందయానములఁ జెన్ను వహించుచు వేలసంఖ్యల
న్మొదవులు కామధేను నిజమూర్తు లన న్విలసిల్లె నయ్యెడన్.

98


క.

కలలోనై నను గఱవును
దలయెత్తఁగనీక జహువిధంబులధాన్యం
బులరాసులు తద్గృహములఁ
గొలఁది యెఱుఁగరాకయుండుఁ గొండలభంగిన్.

99
  1. ప్రజలవలన దమ విభాగముల్ - ప్రజలవలవధర్మ భాగముల్
  2. సంప్రాపితవైభవుండు ధనవంతుఁడు