పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాశ్వాసము

383


త్యాగ నిరూఢికి న్మిగుల నచ్చెరువందుచు భోజుఁ డాత్మ ని
త్యాగమనంబు రోసి తనయంతిపురంబున కేగె సిగ్గునన్.

88


ఇరువదినాలుగవ బొమ్మ కథ

వ.

మఱియు నొక్కదినంబునఁ జతుర్వింశద్వారంబునం గడంగి.

89


క.

శీతగిరిబంధు [1]నూతన
శీతకరాభరణు సింధుశీతలమౌళిం
జేతో జాతవిఘాతి
న్భూతివిభూషణుని సర్వభూతాధ్యక్షున్.

90


చ.

తలఁపుచు విక్రమార్కుని కథాశ్రవణంబున కిచ్చగించి యు
జ్జ్వలమణికిలితం బగు దివస్పతియాసన మెక్కవచ్చుచోఁ
బలికెఁ బసిండిబొమ్మ జనపాలక నీదు తలం పెఱింగితి
న్వలదననేల మేలు వినవచ్చినవారల మాన్పవచ్చునే.

91


శా.

ఓ భోజక్షితిపాల! నిల్చి వినుమా యుర్వీశుఁ డీశార్చనా
లాభాసక్తుఁడు శక్తుఁ డింద్రసమలీలాచారి యాచారి యా
శాభాగప్రవికీర్ణమౌ యశమున న్సర్వార్థి దారిద్ర్యము
ద్రాభంగక్షమదృష్టదృష్టికరుణోదారుండు ధీరుం డిలన్.

92


శా.

ఆ రాజన్యుఁడు నేల యేలునెడ నత్యాశ్చర్యమౌ నేఱులై
క్షీరంబు ల్ప్రవహించు మ్రాఁకుల మధుశ్రేణు ల్మహావృష్టిసం
ధారాపాతములై స్రవించు ధరణిన్ ధాన్యంబులుం బర్వతా
కారత్వంబునఁ బండుచుండు నరలోకం బొప్పుఁ దత్సంపదన్.

93


ఆ.

అట్టి దివసముల జనాధీశ్వరుండు దే
శాంతరములు చూడ నరుగువేళఁ

  1. దినమణి, శీతకరాంబకుని గగనసింధుశశిధరున్