పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాశ్వాసము

385


క.

అనిలునితోడి వివాదం
బున డొల్లిన మేరుశిఖరముల కెన యనఁగా
దినకరున కెదురు [1]వెలుఁగుచుఁ
గనకంబులప్రోవు లతనిగాదెల నొప్పున్.

100


క.

ఓమనుజాధిప యతనికిఁ
దూమెం డల్కినను బుట్లు తొంబది పండం
గామెఱయు పొలముగల స
ద్గ్రామంబులు నూఱు గలవు కంచికి నెనయై.

101


ఉ.

ఈగతిఁ బెక్కుసంపదల నెన్నిక కెక్కిన మద్గురుండు నీ
రోగశరీరుఁడై బ్రదికి రుద్రసఖుం డనఁ గీర్తి దాల్చుచుం
ద్యాగము భోగము జరపి దైవగతిం గడకాలమైన ఖ
ట్వాగతుఁడై తనూభవుల వద్దికి నల్వురఁ బిల్చి యిట్లనెన్.

102


సీ.

ధరణిపై నిడుఁడు ముందటిక్రియ సాగించు
        డర్థంబునకుఁ గాటులాడవలదు
క్రమమున నాల్గుమంచముకోళ్ళక్రింద నేఁ
        బాతినయవి మీకుఁ బాళ్ళు గాఁగఁ
గైకొనుం డాప్తవర్గంబును బెద్దల
        వైశ్యధర్మంబుల వదలవలదు
సంతసంబును బుద్ధిమంతులై [2]పెద్దలఁ
        బోలి బ్రతుకుఁ డంచు బుద్ధి సెప్పి


ఆ.

మిగుల నడలి నేము దిగువకు డించిన
యంత గురుఁడు శివునియందుఁ గలిసె

  1. మెలఁగుచు
  2. పెద్దల బ్రోచి