పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xl


బడినవి. ఆతడు వానిని విస్తరించి తన సమకాలిక విశేషములనే తెలుపుటకు ప్రయత్నించెను.

1. స్త్రీ స్వరూప స్వభావములు :

భర్తృహరి భార్యావంచితుడై స్త్రీల మనశ్చాంచల్యమును అసహ్యించికొను ఘట్టమున మూలశ్లోకములను వదలి స్వతంత్రముగ నిట్లు వ్రాసినాడు.

ఆ.వె. కప్పురంపుఁ గుదుటఁ గస్తూరి యెరువుతో
      నుల్లినాటి చందనోదకముల
      బెంపిరేని దాని కంపుమాయని భంగి
      నెంతయైన నిలువ దింతి మనము. (1-98)

క. వనిత యొరుఁజూచి లోనగు
   నన నిక్కము పతియుఁ దోడి యతివలుఁ బరుఱం
   గని విని యెగ్గొనరించెద
   రని మానిన మానుగాక యడ్డము గలదే.

సీ. మదమెక్కు చన్నులు మాంసపు ముద్దలు
          హేమకుంభములకు నెక్కుడనుచు
   దూషిత మూత్ర పురీష దుర్గంధమౌ
          జఘనంబు కరిశిరస్సదృశమనుచు
   జిలిబికిం బుసులకుఁ జీమిడికిన్ బుట్టి
          యైన మొగంబు సుధాంశుఁ డనుచుఁ
   గండలుఁ దోలు బొక్కలు గూడఁ బొదవిన
          యాకృతి పసిడి సళాక యనుచుఁ

 దేగదైన పెదవి త్రేగ డమృతమని
 కవులు వొగడఁ బేరు గలిగెఁ గాక
 తత్త్వమెఱిఁగి యిట్లు తలపోసి చూచిన
 నింతి రోఁత కెల్ల నిల్లు గాదె. (1-100)