పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxix


నాలుగవ అక్షరము "రా"కు మూలము

"రాజన్! భోస్తవ పుత్రస్య
 యది కల్యాణ మిచ్ఛసి
 దానం దేహి ద్విజాతిభ్యో
 వర్ణానాం బ్రాహ్మణోగురుః."

ఈ శ్లోకమున కథానాయకుడగు నంద భూపాలుడు తన గురువైన శారదానందుని చంపనెంచిన పాపమునకు ప్రతిక్రియ సూచింపబడినది. దీనికి జక్కన

“రాజేంద్ర విజయపాలుని
 రాజిత శుభమూర్తి జేయు రతి గలదేనిన్
 ఓజఁగొని విప్రకోటిం
 బూజింపు మనూనదాన భోజనవిధులన్"

అని మూడు చరణముల భావమును చక్కగా అనువదించి నాల్గవ చరణమును వదలి వేసెను.

గోపరాజు “రాజ భవదీయుఁడైన త
        నూజునకున్ శుభము నోజ నూల్కొను విద్వ
        ద్రాజికి ధనదానము ని
        ర్వ్యాజమునంజేయు మిహపరంబులు గలుగున్"

అని మూడు చరణములనే అనువదించి నాలుగవ చరణమును వదలి మూలమున లేని 'ఇహపరంబులు గలుగున్' అని చేర్చినాడు. దీనిని బట్టి గోపరాజు మూలమునే ప్రధానము అనుసరించెను. కాని జక్కనను అనుసరింప లేదని చెప్పవచ్చును.

కావ్యమందలి విశేషవిషయములు :

గోపరాజు తన కావ్యమునందు అనేక విషయములను ప్రాసంగికముగ అక్కడక్కడ చెప్పినాడు. మూలమునందు కొన్ని విషయములు సూచింప