పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6)

xli


2. స్త్రీ జాతులు { 1-214)

మూలమునందు బహుశ్రుతుడను మంత్రి తనరాజు భార్యారూపమును చిత్రపటముగా వ్రాయించెను చిత్రకారుడు “స తు తస్యారూపం సాక్షాదాలోక్య పద్మినీ లక్షణయుక్తాం తాం విలిలేఖ" అని ఉన్న వాక్యమును పురస్కరించికొని గోపరాజు కొక్కోకము నందు చెప్పబడిన స్త్రీల నాలుగుజాతులు 'పద్మినీ, చిత్తినీ, శంఖినీ, హస్తినీ' లక్షణములను గూర్చి వివరించెను.

3. శకునములు- మూలములో "అకాలవృష్ట్యాదీని దుర్నిమిత్తాని బభూవుః,

"అకాలవృష్టిః తు అథ భూమికంపో, నిర్ఘాత ఉల్కా పతనం తదైవ"

అని మాత్రమే కలదు, గోపరాజు వీనిని వదలి సామాన్యముగా తెలుగువారు పాటించు దుశ్శకునములను చెప్పినాడు.

“పిల్లులు పోరాడుట, బల్లిపలుకుట, తంబళివాడు కనబడుట, ఎదుట తుమ్ముట, దూడను పోగొట్టుకొన్న ఆవు అరచుట, కంపమీది కాకి అరచుట, కుష్ఠురోగి తలకు నూనె రాచుకొని వచ్చుట, మైలబట్టలతో చాకలి ఎదురగుట, కాకి గోరువంక భరద్వాజపక్షి ఎడమ వైపునకు పోవుట, పాలపిట్ట, భరద్వాజపక్షి, పైడికంటి, గుడ్లగూబ కూయుట, పాము ఎదురగుట" ఇవి దుశ్శకునములు. (1-230)

4. డేగవేట- మూలమున లేదు.

5. చేపలవేట- మూలమున లేదు.

ఆకాలమున ఏయే పక్షులను వేటాడుచుండిరో, చేపలలో ముఖ్యజాతు లేవో చెప్పెను. (1-238)

6. వృక్షజాతులు - విక్రమార్కుని ఉద్యానవనము నందున్న మామిడి, అశోక, వకుళ, పున్నాగ, జంబూ, వృక్షములను ఒక్కొక పద్యమున ప్రత్యే