పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

327


ఆ.

మారకమ్మపులి యచట మలయుచున్న
పెద్దమెకములు పెంచిన పిల్లయొక్కొ
యనఁగ వాలుమృగంబుల కదియ యెపుడు
నాటపట్టగుజాడలు తేటపడఁగ.

15


సీ.

అందులపందుల దందంబు క్రందున
        లీలావరాహంబు నేలఁగలసె
నచ్చోటిమదలులాయములతో బెనగి యా
        యెనుపోతు యమలోకముకుఁ జనియె
నక్కడి కృష్ణమృగౌఘంబుచేఁ జాల
        దూలి సారంగంబు గాలిఁబోయె
నట కొండగొఱియల యదుటుననొచ్చి
        మహామేష మగ్ని పాలయ్యె ననఁగ


ఆ.

నొప్పు నితరజంతువులను జెప్పనేల
[1]దువ్వు లెలుఁగులుఁ దోడేళ్ళు దుప్పు లిర్లు
[2]కొరనువులు మెడినాగులు గుజ్జుఁబిళ్లుఁ
గణఁజు లేదులుఁ గుందేళ్ళుఁ గలవు పెక్కు.

16


ఉ.

అయ్యెడ నొక్కయేకల మహంకృతితో గుహనుండి నిచ్చలున్
దయ్యము కైవడి న్వెడలి దౌడలు గొట్టుచు బెట్టు రొప్పుచుం
జయ్యనఁ జొచ్చి యేర్చిన గజంబులు మున్నుగ నమ్మృగంబులన్
వ్రయ్యలుగాఁ బడం బొడిచి వారకచంపుచు నుండు గండునన్.

17


గీ.

ఎదిరిపందులు దానిపైఁ గదిసిపొలియుఁ
బందెగాఁ డొక్కవ్రేటుగఁ బంతమాడి

  1. దుప్పు లెలుఁగులు వ్యాఘ్రంబు లుప్పతిల్ల
  2. వరలు దురువాతులు న్నరపతులు గల్గి
    కొఱనువులు మరినాగులు గుజ్జుశిండ్లు