పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

సింహాసన ద్వాత్రింశిక


యేరా చెప్పఁగనైన మున్నెఱుఁగవే యే విక్రమార్కుండ నీ
క్రూరత్వంబును దర్పము న్బలిమియు న్రూపార్చెద న్నిల్వుమా.

305


క.

అనవుడు రోషంబున ని
ట్లను మాయాబలసమగ్రుఁ డగుదుందుభికి
న్మనుమఁడ నోరి నరాధమ
ఘనభుజదర్పుఁడఁ గఠోరకరుఁడం జుమ్మీ.

306


క.

ఆలమునఁ బంద[1] పగతుఱ
నాలం బొనరించినట్టు లాడెద విటు నా
పాలం బడితివి[2] నేఁడు నృ
పాలాధమ నిన్ను భూతబలి గావింతున్.

307


క.

నీకొలఁదివారియెముకలు
నాకోఱలసందిఁ జిక్కె నలుతును నీ వే
లోకము సొచ్చిననైననుఁ
బోకార్చెద నిన్నుఁ బదరి[3]పోవక నిలుమా.

308


వ.

అనిన వీరరసభీషణంబులగు భాషణంబుల విక్రమభూషణుండును దోర్దండమండితారాతి రాజమండలదండితప్రచండ భుజాగ్రమండనాయమాన మండలాగ్రధరుం డగు నద్దండిమగ లొండొరులం దలంపడి.

309


క.

మదకరులకరణి సింగపుఁ
గొదమలక్రియఁ బులులభంగి గురుపోతుల ప్ర
ల్లదముల[4] శరభంబులగతిఁ
గదిసిరి కదనమున కవని గ్రక్కదలంగఁన్.

310


ఉ.

బంధురవిక్రమస్ఫురతబాహులు దైత్యుఁడుఁ బార్థివుండుఁ గ్రో
ధాంధత మీఱి పోరిరి దశాననుఁడు న్రఘునాయకుండు న

  1. ఆలమునఁ బడిన
  2. నావాలునఁ బడితివి
  3. బెదరి
  4. బెట్టిదమున