పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

263


య్యంధకుఁడున్ హరుండు నరకాసురుఁడు న్నలినాక్షుఁడు న్జరా
సంధుఁడు వాయుసూనుఁడును జంభుఁడు నింద్రుఁడుఁ బోరుకైవడిన్.

311


వ.

ఇట్లు పోరునెడఁ బ్రభాతం బైనఁ దత్కాలోచితంబుగ.

312


క.

క్రందఱి తనతేజమునఁ[1] బు
రందరుదెసఁ దెలివిగలుగ రాత్రించరునిన్
మ్రందించె విక్రమార్కుఁడు
సుందరి ముఖపంకజమున సొంపు నటింపన్.

313


ఆ.

మండలేశ్వరుండు మండలాగ్రంబున
దండి మిగులఁ గలిగి దండిదైత్యుఁ
జెండి పాఱవైచి చండాంశువిధమున
నుండెఁ గండ లుర్విఁ గుండుకొనఁగ[2].

314


ఆ.

దిశలఁ దెలివి గలిగె దివ్యతూర్యంబులు
చెలఁగె నారదుండు మలసి యాడె
నాకసమున నిల్చి యమరవర్గము జన
విభునిమీఁదఁ బుష్పవృష్టి గురిసె.

315


ఆ.

నృపుఁడు సంతసిల్లి నీరజాననఁ జూచి
పడఁతి యిట్లు కొట్లఁబడఁగ నీకు
నేమికతము దీని నెఱిఁగింపవచ్చునేఁ
జెప్పు మనిన వినతి చేసి పలికె.

316


ఆ.

వసుమతీరమణ యవంతిదేశంబులో
ధర్మశర్మ యనఁగఁ దగినవిప్రు
భార్య, గాంతిమతి నకార్యంబు గావించి
కులము చెఱిచి మిగుల గుఱుచనైతి[3].

317
  1. కెందలిరుతేజమునను
  2. మెండుకొనఁగ
  3. కులము చెడితి మిగులఁ గుటిలనైతి