పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

261


మలినాకృతితోఁ గాటుక
మలక[1] క్రియన్నభము తిమిరమయమై పొలిచెన్.

299


ఆ.

అప్పు డధిపుఁ డాపురాంతికవనభూమి
యమున పగిదినున్న తమముఁ జూచి
వైశ్యతనయ వెఱవ వల దని తెలుపుచు
నచట నసురరాక యరయుచుండె.

300


ఆ.

వాలుఁగంటిమొఱ్ఱ వాలాయమగు నాన
వాలుగాఁగఁ జీకువాలు సొచ్చి
వాలు పెఱికికొనుచు వాలుమగం డేఁగె
వాలు దైత్యునుదుటివ్రాలు దుడువ.

301


క.

ఈరీతి గాచియుండఁగ
నారాక్షసుఁ డంత నంగనామణి మొత్తం
గా రావము వినవచ్చిన
నారాజును నాలకించి యతిరభసమునన్.

302


క.

వెఱవకు వెఱవకు తరుణీ
మొఱ యాలించితి[2] నృపాలముఖ్యుఁడ నీకై
పలుతెంచితిఁ బరిపరిగాఁ
గఱకు టసురఁ జెండివైతుఁ[3] గాచెద నిన్నున్.

303


వ.

అని.

304


శా.

ఓరీరాక్షస వట్టిగర్వమున నీ వుప్పొంగి దీనానన
న్నారీరత్నము నేల నొంచె దిటు లన్యాయంబు గావింతువే

  1. కాటుకమలక = మసిమూఁకుడు
  2. మొఱగగు వచ్చితి
  3. టసుర నిపుడె చెండి