పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxi

ఈ రెండు శ్లోకములును వ్యాస గీతాశ్లోకములే. సాధారణముగ ప్రాచీనశాసనములలో చివర ఫలశ్రుతి భాగమున నివి చెక్కబడును.

గోపరాజు మూలమునందలి శ్లోకములనుగాక అక్కడక్కడ తనకు తెలిసిన సంస్కృత గ్రంథములందలి శ్లోకములను సందర్భానుసారముగ అనువదించి వాడుకొనెను. ఇవి మూలమున లేవు. సుప్రసిద్ధ శ్లోకమగు

“అయోధ్యా, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతికా
 పురీ, ద్వారవతీచైవ సప్తైతే మోక్షదాయకాః॥

అనుదానికి

“మధుర, కంచి, కాశి, మాయాపురము, ద్వార
 వతి, యయోధ్య, యీ యవంతిపురము
 నాఁగ నెగడు ముక్తినగరంబులం దున్న
 నరులు పుణ్యభాజనములు గారె" (1-73)

అని అనువదించెను, ఇట్లే మయూరుని సూర్యశతకము నుండి, జయదేవుని ప్రసన్నరాఘవము నుండి. అన్నపూర్ణాష్టకము నుండి అనువదించి ఇందు వేసికొనెను.

జక్కన - గోపరాజు :

గోపరాజునకు ముందున్న జక్కనకవి, 'విక్రమార్క చరిత్రము'ను ప్రబంధ ఫక్కిలో రచించెను. అతడు విజయనగర సామ్రాజ్యమును 1423-1447 సం॥ మధ్య పరిపాలించిన ప్రౌఢ దేవరాయల కాలమువాడు. శ్రీనాథ కవిసార్వభౌమునకు సమకాలికుడు. జక్కన తాను ప్రబంధ శయ్యగా తెలుగున విక్రమార్క చరిత్రమును చెప్పెదననెను. కాని సంస్కృత గ్రంథమున కనువాదము చేసితిననలేదు. శ్రీ పింగళి లక్ష్మీకాంతముగారు-