పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxx


తమ్యము తెలియక విక్రమార్కుని పిలిపించి తెలిసికొని దివ్య సింహాసనము ననుగ్రహించినట్లున్నది. గోపరాజు దానిని మార్చెను. విశ్వామిత్రుని తపోభంగము చేయించుటకై రంభా ఊర్వశులలో నెవరిని పంపవలెనో ఎవరి యోగ్యతలెట్టివో తెలియక ఇంద్రుడు విక్రమార్కుని పిలిపించుచినట్లు వ్రాసెను. విశ్వామిత్రుని కాలమేదో విక్రమార్కుని కాలమేదో సామాన్యునకు తెలియును కాని గోపరాజునకు తెలియలేదు. అతడు చేసిన మార్పులను తెలిసికొనుటకిది చాలును. మూలమునందు రసవత్తరములైన నీతిశ్లోకములుండగా గోపరాజు వానినివదలి వేసెను. అక్కడక్కడ సూచనాప్రాయముగ చెప్పెను. మూలములోని

   “నవిషం విషమిత్యాహుః బ్రహ్మాస్వం విషముచ్యతే
    విషమేకాకినం హంతి బ్రహ్మస్వం పుత్రపౌత్రకం"

అన్నదానికి

క. గతిగానక యిది యొక సం
   గతి బ్రదికెదమంచు నుండఁగా ధర్మముఁద
   ప్పితి “బ్రహ్మస్వం విషము
   చ్యతే" యనుచుఁ బెద్దలెల్లఁ జదువుట వినవే. (1- 176)

   అని వ్రాసెను. ఈ పద్యము క్రిందనే

క. బలవంతులమని విప్రుల
   ఫలభోగంబులకు నాసపడుదురె మును వి
   ప్రులకిచ్చిన భూములు దమ
   చెలియండ్రని తలఁపవలదె క్షితిపాలురకున్. (1-178)

   అను పద్యమును వ్రాసెను. ఇది మూలములో లేదు. వ్యాసగీతాశ్లోకము

  “ఏకైవ భగినీ లోకే సర్వేషామేవ భూభుజాం
   నభోగ్యా నకరగ్రాహ్యా విప్రదత్తా వనుంధరా"