పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

సింహాసన ద్వాత్రింశిక


వ.

నావుడు నారక్కసుం డోనరోత్తమ నీ వడిగినవరం బిచ్చితిఁ బుణ్యపురుషుండవు బొంకకు నీ వెవ్వండ వనిన నవ్వసుమతీవల్లభుండు పూర్వదేవుండవు నీ వెఱుంగవే విక్రమార్కుండ నగుదు నాచరిత్రంబు జను లెఱుంగకుండఁ గృప చేసి శాంతుండవు గమ్మని మ్రొక్కి తదనుజ్ఞాతుం డై యజ్ఞాతభావంబున నిజపురంబగు నుజ్జయినీపురంబునకుం జనుదెంచెం గావున.

273


క.

ఇట్టిగుణంబులు నీ కే
పట్టున సమకూరకునికిఁ బార్థివ చను మి
ట్టట్టును బొరలకు మనవుడు
దిట్టతనం బుడిగి వసుమతీపతి మగిడెన్.

274


పండ్రెండవ బొమ్మ కథ

వ.

మఱియుం గొన్ని దినంబు లరిగిన.

275


క.

కంబూపమగళు మృగమద
జంబాలీకృతమహావిషద్యుతిసదృశ
స్తంబేరమచర్మాంబరు
లంబోదరగురుఁ గృపావలంబునిఁ గొలుతున్.

276


చ.

అని మదిలో దలంచుచు ధరాధిపుఁ డిష్టజనోపదిష్టమౌ
దినమున నెక్కఁ బూని యరుదేరఁగ నచ్చటిబొమ్మ చూచి యో
జనవర విక్రమార్కుగతి సాహసదానగుణంబు లేక నీ
కెనయఁగ దేవతాసనము నెక్కఁగవచ్చునె[1] నిల్వు నావుడున్.

277


క.

అతనికడ నట్టిసాహస
వితరణగుణ మెట్లు చెల్లె వినిపింపు మనం

  1. యెత్తున నమరాసనంబు వెసఁ ద్రొక్కఁగ వచ్చునె