పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

257


బతిగుణములు పండ్రెండవ
ప్రతిమ యెఱింగింప భోజపతి కి ట్లనియెన్.

278


మ.

విను మావిక్రమభూషణుండు విమలోర్వీనాథసందోహత
ర్జనసంపన్నజయాభిరాముఁడు సదాచారప్రచారోచితా
త్మనయప్రాభవధర్మనందనుఁడు విద్వత్పాలనాకేళిసం
జనితానందుఁడు సాగరాంతముగ నీక్ష్మామండలం బేలఁగన్.

279


ఆ.

ఆతనివీట నర్థపతి కెనయగు భద్రం
సేనుఁ డనఁగ నొక్కసెట్టి గలఁడు
వాని కొకఁడు గలిగె దానసుందరుఁడు పు
రందరుం డనంగ నందనుండు.

280


క.

ఆకోమటి కడపటఁ బర
లోకమునకుఁ జనిన నర్థలోభ ముడిగి సు
శ్లోకుండు పురందరుఁ డీ
లోకము గొనియాడ దానలోలుం డయ్యెన్.[1]

281


క.

అతని దగువ్యయముఁ గనుఁగొని
హితు లందఱు వచ్చి బుద్ధి యిదిగా దుచిత
స్థితి నడువు మహౌదార్యో
న్నతి దారిద్ర్యంబు వచ్చు నరపతి కైనన్.[2]

282


ఆ.

ధనము గలుగువాఁడె ధన్యుండు మాన్యుండు
ధనము గలుగువాఁడె ఘనుఁడు జగతి


  1. క. ఆకాశసాగరాంతర ....... శ్లోకుఁడు పురందరుండీ, లోకము
    గొనియాడ దానలోలుం డయ్యెన్
  2. సమున్నతి ధనమునఁ జొప్పడు హీనత దారిద్ర్యమున వచ్చు