పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

249


మారుతప్రేరితం బగుపూరిబొమ్మ
భాతి నేతెంచె జీమూతకేతుఁ డటకు.

233


వ.

ఇట్లు చనుదెంచి యట గురుజనప్రాణభయాకులుండై నెత్తుట జొత్తిల్లిన యురగకుమారునిమీద నొరగిన కుమారుమ్రోల వాలి.

234


సీ.

ఓయయ్య మీబావయును నీవు నాడుచు
        నున్నార లని నమ్మి యుంటిఁగాక[1]
ద వ్వేగనిత్తునే [2]తడసిన రానైతిఁ
        గుణరత్న మౌ నిన్నుఁ గోలుపడితి
రాజ్యంబు విడిచి యరణ్యంబుఁ జేరియు
        నీ సేవ సౌఖ్యంబు నెగడఁగంటి
సద్భక్తి సేయవే సరగున నోయన్న[3]
        చెడుగుఁబాముల కేల జీవమీయ


ఆ.

గరుడనఖముఖాగ్రఘాతంబునకుఁ జొరఁ
బూనె మెత్తనైన మే నదెట్లు
మాకు దిక్కుగలరె యోకరుణాకర
చీఁకు చేతికోల చిన్ని కుఱ్ఱ.[4]

235


వ.

అని పలవరించుచు మేనంటి చూచుచుండఁ గనకవతియుం గనుఁగవ నశ్రుపూరంబు తోరంబుగాఁ బెదవులు దడుపుచు మొగము వెలవెలంబుచ్చుచుఁ గోడలిం గూడి గోడాడుచు.

236


సీ.

ఓతండ్రి యందఱ నొక్కపెట్టునఁ జంపఁ
        గడఁగితి వొకపాముఁ గావఁబూని

  1. నున్నారటంచు నేనుంటిఁగాక
  2. ధర్మైకనిరత
  3. సద్భక్తి సేయ వేసరితివో యోయన్న
  4. చెఱుకు చేతికోల చిన్నికూన