పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

247


ఆ.

కాంచి మున్నతండు వంచించి వచ్చుట
తెలిసి తన్నుఁ దాన తిట్టికొనుచుఁ
గులముఁ గావనైతి గురునాజ్ఞఁ దప్పితి
నన్ను డాఁచి యొకని మన్నిగొంటి.

224


ఆ.

ఇట్టి కష్టజీవ మేటికి నాకని
చాఁ గడంగి యచటి కేఁగుదెంచి[1]
ఖేచరేంద్రతనయుఁ జూచుచుఁ దలయూఁచి
భుజగవైరిఁ జూచి భుజగవరుఁడు.

225


మ.

వినతానందన దీనరక్షణపరున్ విద్యాధరేంద్రాత్మజుం
దిన ధర్మం బగునే సహింపు మకటా దృష్టింపవే పాములం
దినవే యాచవి మున్నెఱుంగవె భవద్భీతాత్ముఁడౌ రాజుపం
పున నే వచ్చితి నాగపుత్రుఁడ ననుం బోనీక భక్షింపుమా.

226


వ.

అనిన గరుడుండు పడియున్న యక్కుమారకుం జూచి నే నెఱుంగనైతి నీ కీదుర్మరణోద్యోగం బేల యనవుడు నతం డే మని చెప్పుదు నాయత్నం బంతయు విఫలం బయ్యె.

227


క.

వికలము లగుప్రాణంబుల
నొకయుపకారంబు సేయనోపుదు నని కౌ
తుకమున నినుఁ గొలువఁగ వీక
డకటా యవసానవైరి యై చనుదెంచెన్.

228


చ.

అనునెడ శంఖచూడుఁడు రయంబున డగ్గఱ వచ్చి యెత్తి యో
ఘనకరుణార్ద్రమానస యకారణబాంధవ సత్యసంధ యీ

  1. పోఁగడంగి యచటి కేఁగుదెంచి-చావఁదలఁచి యచటి క్రేవవచ్చి.