పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

సింహాసన ద్వాత్రింశిక


హరిదంతంబులు పక్షకాంతి నవసంధ్యాలీలఁ గీలింపఁగా
గరుడుం డార్చుచు వచ్చె నచ్చటికి నాకారంబు ఘోరంబుగన్.

217


ఉ.

వచ్చి యతండు మస్తమున వ్రయ్యలు వారఁగఁ దన్ని ముక్కునన్
గ్రుచ్చి వియత్పథంబునకుఁ గొంచుఁ జనంగఁ గిరీటరత్నముల్
చెచ్చెర మాంసఖండముల చెల్వున భూమిఁ బడంగ నిచ్చలో
మెచ్చి కుమారకుండు ధృతిమేరువు మే లొనగూడె నా కనన్.

218


ఉ.

అంబరసీమనుండి మలయాద్రిశిలాస్థలి వ్రాలి యేకచి
త్తంబున మాంసఖండములు దర్పము గ్రమ్మగఁ ద్రెంచి మ్రింగఁగా
నంబరచారినందనుఁడు హర్షరసంబున మేను వొంగ వ
క్త్రాంబుజ ముల్లసిల్లఁ బులకాంకితుఁడై విహాగేంద్రుఁ జూచినన్.

219


వ.

అంతఁ బక్షీంద్రుండు.

220


ఉ.

వేదన మేను స్రుక్క దరవిందముకాంతిఁ దొఱంగ దాననం
బాదరణంబు నాయెడ మహాఘన మైనది యంతరంగ మా
మోదతరంగితంబు నిజమూర్తివిలాసము దివ్య మిట్టి కా
కోదరజాతి లేదు సుగుణోత్తమ యెవ్వఁడ వీవు నావుడున్.

221


ఉ.

ఎవ్వఁడ నైన నేమి[1] మది నిన్నివిచారము లేల నీకు నొం
డెవ్వఁడు భక్షణం బగు నహీశ్వరబంధువు[2] గాక యియ్యెడన్
మవ్వము దప్ప దంగలత మానపు గంటుల రక్తపూరముల్
క్రొవ్వినమాంస మున్న యది కొమ్ము భుజింపు భుజంగమాంతకా.

222


క.

అనునెడ నాగోకర్ణే
శునకుం ప్రణమిల్లి శంఖచూడుఁడు మగుడం
జను దేంచి వధ్యశిలమీఁ
ద నవం బగు రక్తబిందుతతిఁ బొడఁగాంచెన్.

223
  1. నైతి నేమి
  2. నహీంద్రులఁ దిందువు