పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

227


వ.

అని యంతకుమున్న నిజదర్శనంబునఁ జంద్రావలోకనంబునం గరంగు చంద్రకాంతంబు క్రియఁ జిత్తంబు గరంగి మేన ఘర్మజలంబులు మణిగణభూషణంబులుగా లజ్జారాగనిమగ్నయై వనుబేటంబున గాటంబగునారాటంబునఁ దుంటవిల్తుండు మానంబు వేఁటాడ[1] బోటి పూఁబొదమాటు సొరం దలంచునెడ వసంతానుగమ్యమానుండగు మీనకేతనుని భాతి డగ్గఱి యోలీలావతి నీ వెవ్వరిదాన వీగౌరీగేహంబున కరుగుదేరం గారణం బేమి నావుడు విని చతురికయను తత్సఖి లేచి బాలలకుఁ బ్రౌఢత్వంబు గలదె యేను విన్నవించెద నవధరింపుఁడు.

119


క.

వసుమతిఁ బరఁగిన మిత్రా
వసుసోదరి సిద్ధవంశవరుఁ డను విశ్వా
వసుసుత మలయవతి విభా
వసునిభుఁడగువరుని వేఁడవచ్చిన దిటకున్.

120


వ.

అనిన నక్కుమారుండు నామాట తప్ప దిది కన్యక యగుట వింటివే యనుడు నమ్మధుకరుండు దైవయోగమ్మున సమానవయోరూపంబులు గలవధూవరు లిట్లు గూడుదురే యని.

121


క.

వనరుహగర్భుని నేరమి
ననురూపసువస్తుయోగ మగపడదు జగం
బున మీబోంట్లకు నగపడుఁ
గనకము రత్నమ్ముఁ గూడుకైవడి నొకచోన్.

122


వ.

అని చతురికం జూచి నిజసఖుని దెసం జూపి.

123


క.

జీమూతకేతుసుతుఁ డరి
జీమూతసమీరణుండు చిత్తజనిభుఁ డౌ

  1. తుంటవిల్లుచే మానసంబు పేటెత్త. చి. సూ.