పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

సింహాసన ద్వాత్రింశిక


గౌరిఁ బాడుచున్న కన్యకారత్నంబుఁ
జూచె నచట దాలఖేచరుండు.

114


వ.

అంతఁ దదీయలావణ్యమధుమత్తనయనమధుకరుండై మధుకరునితో నిట్లనియె.

115


క.

వనితారత్నము నవయౌ
వనయై పొదరింట నున్నవనలక్ష్మిక్రియన్
దొన నున్నమరునిబాణం
బన నున్నది యిచట మోహనాకృతితోడన్.

116


సీ.

ఇది దేవకామిని యేని నింద్రుని వేయు
        గన్నులు సఫలము ల్గాక యున్నె
యిది నాగకన్యక యేనిఁ బాతాళంబు
        సోముఁడు లేఁ డని శూన్య మగునె
యిది ఖేచరాంగన యేని మాజాతికి
        బ్రభ యెక్కు చెఱకునఁ బండుగాదె
యిది సిద్ధబాలిక యేని లోకంబులో
        సిద్ధకులంబు ప్రసిద్ధిఁ గనదె


ఆ.

యిది వనాంతలక్ష్మి[1] యేని వనం బెల్లఁ
బల్లవింపకున్నె యెల్లయపుడు
నిది సుధాంశురేఖ యేని యీగుడి నున్న
శిలలు చంద్రకాంతశిలలు గావె.

117


క.

పరసతులను దల్లులఁగాఁ
బకెకించెడు నాకు దీనిపైఁ జిత్తం బే
వెరవునఁ దగిలెనొ యిది కృత
పరిణయ గాకుండఁబోలుఁ బరికింపుదమా.

118
  1. వసంతలక్ష్మి